అరసవల్లిలో నరకచతుర్ధశి
అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో నరకచతుర్ధశి ఉత్సవం బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయ అనివెట్టి మండపంలో ఉషా పద్మిని ఛాయాదేవేరులతో ఆదిత్యుని ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. మంగళహారతి ఇచ్చిన అనంతరం ఉత్సవమూర్తులను తిరువీధిగా తీసుకెళ్లి ఆలయ ఉద్యానవన తోట (చిన్నతోట)లోని మండపంలో కొలువుదీర్చారు. అనంతరం నరకాసురుని బొమ్మను దహనం చేశారు. తిరిగి ఉత్సవమూర్తులను ఆలయంలో చేర్చారు. కార్యక్రమంలో ఈవో వై.భద్రాజీ, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ తదితరులు పాల్గొన్నారు.
మద్యం బెల్టుషాపులు
నిర్వహిస్తే చర్యలు
శ్రీకాకుళం క్రైమ్: నూతన మద్యం పాలసీ ఆధారంగా ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్మకాలు జరిపితే చర్యలు తప్పవని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మద్యం ధరల పట్టికను దుకాణాలు ముందు తప్పనిసరిగా ఉంచాలని, దీన్ని అమలుపరిచేలా స్టేషన్ ఎస్‌హెచ్‌వోలు, సిబ్బంది నిరంతరం నిఘా పెట్టాలన్నారు. బెల్టు దుకాణాలు ఎక్కడ నిర్వహించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా బెల్టుషాపులకు మద్యం సరఫరా చేసే దుకాణాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
ఇచ్ఛాపురం రూరల్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవంబర్ 1న ఈదుపురం వస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి సీఎం సభాస్థలి, హెలీప్యాడ్ ప్రదేశంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment