యూబీ పరిశ్రమలో సీఐడీ తనిఖీలు
రణస్థలం: రణస్థలం మండలంలోని యునైటెడ్ బ్రూవరీస్ పరిశ్రమలో బుధవారం సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. 2019–24 మధ్య జరిగిన లావాదేవీలపై సుమారు 12 మంది కలిగిన సీఐడీ బృంద సభ్యులు తనిఖీలు చేపట్టారు. పలు రికార్డులను పరిశీలించారు. విధ్యుత్ బిల్లులు, ఐదేళ్ల ఉత్పత్తి, అమ్మకాల రికార్డుల వివరాలు నమోదు చేసుకున్నారు. రికార్డులు, హార్డ్ డిస్క్‌లు తమ వెంట తీసుకువెళ్లారు. ఉత్పత్తి, బీరు బాటిల్ లేబుల్లు, ఉద్యోగుల వివరాలు, లారీల ట్రాన్స్‌పోర్ట్, కార్మికుల రికార్డులు, ఆర్థిక లావాదేవిలను క్షుణ్ణంగా పరిశీలించారు. బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. గత ప్రభుత్వంలో పనిచేసిన ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డైరెక్టర్ డి.వాసుదేవరెడ్డి 18 ఆగస్టు 2022లో యూబీ పరిశ్రమను సందర్శించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ప్రభుత్వం తనిఖీలు నిర్వహించినట్లు పరిశ్రమ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ తనిఖీల్లో సీఐడీ డీఎస్పీ, సీఐ, సిబ్బంది, రణస్థలం రెవెన్యూ, ఎకై ్సజ్, విజిలెన్స్, జే.ఆర్.పురం పోలీసులు వంటి అధికారులు సుమారు 40 మంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment