● ‘విభిన్న’ ప్రమిదలు
వినూత్న ఆలోచనల్లోనూ తాము ఎవరికీ తీసిపోమని నిరూపిస్తున్నారు కొందరు విభిన్న ప్రతిభావంతులు. దీపావళి సందర్భంగా అందమైన రంగులలో వినూత్నమైన రూపాల్లో సృజనాత్మకతతో ప్రమిదలు తయారు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లా కేంద్రంలోని బెహరా మనోవికాస కేంద్రంలోని మానసిక దివ్యాంగులు ప్రమిదలకు అందమైన రంగులు అద్దుతూ అమ్మకానికి సిద్ధం చేశారు. 74 మంది విభిన్న ప్రతిభావంతులు ఈ ప్రమిదలు రూపొందించారని, ప్రమిదలు ధర రూ.5 నుంచి రూ.60 వరకు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి గల వారు కొనుగోలు చేయాలనుకుంటే 9848868960 నంబరును సంప్రదించాలని నిర్వాహకురాలు శ్యామల కోరారు.
Comments
Please login to add a commentAdd a comment