కాశీబుగ్గ: శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో రక్తతర్పణ చేసిన తొలి ఆదివాసీ అమరవీరులు ఆరిక కోరన్న, కొండగొర్రి మంగన్నల 57వ వర్థంతి సభను మందస మండలం కొండలోగాం ఆదివాసీ గ్రామంలోని అమరజీవి సవర చిలకమ్మ స్థూపం వద్ద శుక్రవారం నిర్వహిస్తున్నట్టు సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమొక్రసీ జిల్లా కమిటీ కార్యదర్శి తాండ్ర ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉదయం 9 గంటలకు జరగబోయే ఈ స్మారక సభలో పలు ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని పేర్కొన్నారు. ఆదివాసీ ప్రజలు, ఇతర ప్రజా సమూహాలు పాల్గొనే ఈ సభను విజయవంతం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment