శ్రీకాకుళం: జిల్లా ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించేందుకు సర్వశిక్షా అభయాన్‌లో కొందరు ఉద్యోగులు స్కెచ్ వేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నిత్యావసర సరకులు, మాంసం, గుడ్లు సరఫరా చేసేందుకు ముందుగా టెండర్లు నిర్వహిస్తారు. టెండర్ రోజున ఖరారు చేసిన ధరలకే సంవత్సరం పొడవునా సరఫరా చేయాల్సి ఉంటుంది. రేటు పెరిగినా, తగ్గినా ఇందులో మార్పు ఉండదు. దీనిలో భాగంగా గుడ్డు ధర పేపరు ధరకు సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఇందుకు భిన్నంగా కొన్ని నెలల నుంచి గుడ్డు ధర రూ.6.30 పైసలకు బిల్లు దాఖలు చేస్తున్నారు. బిల్లులు దాఖలు చేసే నాటికి గుడ్డు ధర రూ. 5.50పైసలు ఉండగా అదనంగా 80పైసలు చెల్లిస్తూ వస్తున్నారు. కేజీబీవీల నుంచి రూ.6.30పైసలకు బిల్లులు వస్తుండగా ఆ మేరకు చెల్లింపులు కూడా జరిగిపోయాయి. ఎస్‌ఎస్‌ఏలోని అధికారుల సూచ నల మేరకే బిల్లులు దాఖలు చేస్తున్నట్లు ఎస్‌వోలు చెబుతున్నారు. కాగా అదనపు చెల్లింపుల విషయం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఆయన వివరణ కోరడంతో రెండు రోజులుగా ఎస్‌వోలపై ఎస్‌ఎస్‌ఏలోని కొందరు ఉద్యోగులు ఒత్తిడి తెస్తూ పేపరు ధరకే బిల్లులు దాఖలు చేస్తున్నట్లు లిఖితపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఎస్‌వోలు ‘సాక్షి’కి తెలిపారు. బిల్లులు దాఖలు చేసినదానికి విరుద్ధంగా లేఖలు ఇస్తే తాము తప్పు చేసినట్లు అవుతుందనిర, తమను హెచ్చరిస్తూ వ్యాఖ్యానాలు చేస్తున్నారని, వాయిస్ మెసేజ్‌లు కూడా పెడుతున్నారని వాపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో లేఖలు ఇవ్వకూడదని బుధవారం జరిగిన ఎస్‌వోల రహ స్య సమావేశంలో నిర్ణయించుకున్నట్లు భోగట్టా. ఇదిలా ఉంటే నిత్యావసర సరకుల సరఫరా కాంట్రాక్ట్ కూడా కాంట్రాక్ట్ పొందిన వ్యక్తి కాకుండా వేరొకరు సరఫరా చేస్తున్నట్లు, అవి నాశిరకంగా ఉంటున్నట్లు ఎస్‌వోలు చెబుతున్నారు. అయితే బిల్లులు మాత్రం కాంట్రాక్ట్ పొందిన సంస్థ నుంచే దాఖలు అవుతుండడంతో వారికి బిల్లులు చెల్లిస్తున్నారు.
రికవరీ చేస్తాం..
ఈ విషయాన్ని అకౌంట్ సెక్షన్ సూపరింటెండెంట్ పద్మావతి వద్ద ప్రస్తావించగా గుడ్డు ధర అదనంగా చెల్లించడం వాస్తవమేనన్నారు. వారి నుంచి రికవరీ చేస్తామన్నారు. బిల్లుకు విరుద్ధంగా ఎస్‌వోలను లేఖలు అడగడం నిజమేనని, ఎఫ్‌ఏవో సూచనల మేరకే ఎస్‌వోలకు వాయిస్ మెసేజ్ పెట్టామన్నారు. నిత్యావసర సరకుల కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారో, ఎవరు సరఫరా చేస్తున్నారో తనకు తెలియదని పేర్కొన్నారు.
ఉన్నతాధికారులను తప్పుదోవ
పట్టించేందుకు కొందరు ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల స్కెచ్
డైట్ బిల్లులకు భిన్నంగా లేఖలు ఇవ్వాలని కేజీబీవీ ఎస్‌వోలపై ఒత్తిడి
Comments
Please login to add a commentAdd a comment