No Headline
ఆమదాలవలస రూరల్: వేసవి తాపం పెరగడందో దోసకాయలకు గిరాకీ పెరిగింది. చల్లని నేస్తాలుగా పేరుపొందిన దోసకాయలు మన జిల్లాతో పాటు ఒడిశాకు చెందిన వారు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడి రైతులు ప్రతి రోజూ ఇతర జిల్లాకు వీటిని ఎగుమతి చేస్తూ తమ వ్యాపారాలను ముందుకు సాగిస్తున్నారు. ఆమదాలవలస మండలంలో మునగవలస, జొన్నవలస, సరుబుజ్జిలి మండలంలో రొట్టవలస, అవతరాబాద్ గ్రామాల్లో దోసకాయలు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. మార్కెట్‌కు తరలించడంతో పాటు రోడ్డు పక్కన రైతులే స్వయంగా విక్రయాలు సాగు చేస్తున్నారు. వివాహాది శుభకార్యాలు చేసుకునే వారు దోసకాయలను విందు భోజనాల్లో సైతం అందుబాటులో ఉంచుతున్నారు. అందుకే వీటికి గిరాకీ పెరిగింది. సైజు బట్టి రూ.5 నుంచి రూ.30 వరకు, కిలో రూ.50 చొప్పున రైతులు విక్రయిస్తున్నారు. మునగవలస, రొట్టవలస గ్రామాల వద్ద దోసకాయలను ఇతర జిల్లాలకు చెందిన ప్రయాణికులతో పాటు ఒడిశా వాసులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment