టెక్కలి ఆస్పత్రిలో పనిచేయని లిఫ్ట్‌ | - | Sakshi
Sakshi News home page

టెక్కలి ఆస్పత్రిలో పనిచేయని లిఫ్ట్‌

Published Mon, Aug 26 2024 10:24 AM | Last Updated on Mon, Aug 26 2024 10:24 AM

-

టెక్కలి రూరల్‌: టెక్కలి జిల్లా ఆస్పత్రిలో లిఫ్ట్‌ పనిచేయడం లేదు. జనసేనకు చెందిన కురాకుల యాదవ్‌ మరో ఇద్దరు యువకులతో కలసి ఆదివారం సా యంత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించేందుకు వచ్చారు. రెండో ఫ్లోర్‌లో ఉన్న వ్యక్తిని పరామర్శించి లిఫ్ట్‌లో కిందకు వస్తుండగా ఒక్కసారిగా లిఫ్ట్‌ మధ్యలో ఆగిపోయింది. ఎంతసేపటికీ ఎవరూ స్పందించకపోవడంతో కొమ్ము హర్షవర్ధన్‌ అనే వ్యక్తి ఊపిరాడక సతమతమైపోయాడు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్‌ చేశాక ఎవరో ఒక వ్యక్తి వచ్చి లిఫ్ట్‌ తాళాలు తీసి వారికి బయటకు తీసుకువచ్చారు.

దాదాపు ముప్పై నిమిషాలు యాతన పడ్డామని, ఎవరైనా రోగికి ఇదే పరిస్థితి ఎదురైతే ఎవరు బాధ్యులని వారు ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement