బలరామ ప్రతిష్ట..ఉమారుద్ర ఆలయ ప్రత్యేకత
శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలో అతిపురాత దేవాలయంగా గుడివీధిలోని ఉమారుద్ర కోటేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధిగాంచింది. బలరాముడు ప్రతిష్టించిన దేవాలయంగా ప్రఖ్యాతి చెందిన ఈ ఆలయం వద్ద కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణమి(పంచరత్నా) రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అమావాస్య తదుపరివచ్చే త్రయోదశితో కూడిన చతుర్ధశినాడు మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరుగుతాయి. నాలుగో సోమవారం స్వామివారికి 2016 రుద్రాక్షలతో పూజ చేసి అలంకరిస్తారు. ఉదయం 3 గంటల నుంచి ఆలయ ప్రవేశం, ప్రత్యేక పూజలు, భక్తుల రద్దీ బట్టి రుద్రాభిషేకాలు చేయిస్తారు. ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాజరాజేశ్వరీ మహిళా మండలి ఆధ్వర్యంలో సామూహిక లలీతా సహస్రనామ పారాయణ ఉంటుందని అర్చకులు ఆరవెల్లి శ్రీరామమూర్తి, ఈఓ సర్వేశ్వరరావు తెలిపారు. మున్సిపల్ శాఖ సహకారంతో నాగావళి నది ఒడ్డును పరిశుభ్రం చేయించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment