ప్రకృతి వ్యవసాయం పెరగాలి: కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ప్రకృతి వ్యవసాయం సాగు విస్తీర్ణాన్ని పెంచాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జిల్లాలో పంటల సాగు, ఆదాయం మరింత పెరగాలని సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్గానిక్ ఉత్పత్తుల అమ్మకాలకు సర్టిఫికేషన్ అవసరమన్నారు. కలెక్టర్ సంబంధిత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో ఉత్పత్తుల ప్యాకింగ్‌పై ఆరా తీశారు. ఆర్ట్స్ సంస్థ ప్రతినిధి సన్యాసిరావు ప్యాకింగ్ విధానంపై వివరించారు. ఆర్గానిక్ ఉత్పత్తుల అమ్మకానికి ము న్సిపాలిటీ పరిధిలో ఎక్కడైనా స్థలాన్ని కేటాయించాలని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కోరగా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడి సంబంధిత ఏర్పాట్లు చేయాలని, అలాగే మెప్మా మార్ట్‌లో ఆర్గానిక్ ఉత్పత్తులపై ఒక ర్యాక్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారికి ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఉద్యాన అధికారి ఆర్.వరప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి త్రినాథ స్వామి, మార్కెటింగ్ సహాయ సంచాలకులు బి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment