హమాలీల సమస్యలు పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

హమాలీల సమస్యలు పరిష్కరించండి

Published Tue, Nov 19 2024 1:04 AM | Last Updated on Tue, Nov 19 2024 1:04 AM

హమాలీల  సమస్యలు పరిష్కరించండి

హమాలీల సమస్యలు పరిష్కరించండి

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సివిల్‌ సప్లయ్‌ హమాలీల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఏపీ సివిల్‌ సప్లయ్‌ హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చిక్కాల గోవిందరావు డిమాండ్‌ చేశారు. స్థానిక సివిల్‌ సప్లయ్‌ గోడౌన్‌ వద్ద యూనియన్‌ పిలుపు మేరకు సోమవారం హమాలీలు ధర్నా నిర్వహించి, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ.. గతేడాది డిసెంబర్‌లో హమాలీల కూలీ రేట్ల అగ్రిమెంట్‌ ముగిసినా, నేటికీ కొత్త కూలీ రేట్ల అగ్రిమెంట్‌ చేయకుండా సంబంధిత అధికారులు కాలయాపన చేయడం సరికాదన్నారు. హమాలీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని, వెంటనే కొత్త కూలీ రేట్లుతో అగ్రిమెంట్‌ ఇవ్వాలని కోరారు. కూలీ డబ్బులు కూడా సకాలంలో అకౌంట్లలో జమ అవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేసిన హమాలీల పీఎఫ్‌ డబ్బులు సకాలంలో రావడం లేదని తెలిపారు. కొత్తగా చేరినవారి పేర్లు రికార్డుల్లో నమోదు చేసి పీఎఫ్‌ అమలు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో సంఘ అధ్యక్షుడు శ్రీమన్నారాయణ, ఎంఎల్‌ఎస్‌ గోడౌన్‌ మేసీ్త్రలు గౌరీ శంకర్‌, కృష్ణారెడ్డి, రామారావు, సీహెచ్‌ సతీష్‌, జి.దుర్యోధన, రాము, సీతయ్య, కామరాజు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement