ఫెంగల్ అలర్ట్
● కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్
శ్రీకాకుళం పాతబస్టాండ్: అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయనే అంచనాల నేపథ్యంలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రైతులు ధాన్యాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని, ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని కోరారు.
● పడిపోతున్న పైర్లు
నరసన్నపేట: మండలంలో గురువారం వేకువజాము నుంచి గాలుల తీవ్రత పెరగడంతో వరి పైర్లు నేలకొరుగుతున్నాయి. సత్యవరం, నరసన్నపేట, ఉర్లాం, బడ్డవానిపేట, బాలసీమ గ్రామాల్లో వరి పొలాలు ఒరిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతలు పూర్తయిన చోట్ల వరికుప్పలు పెట్టే పనిలో నిమగ్నమవుతున్నారు.
● వేటకు విరామం
కవిటి: తుఫాన్ హెచ్చరికలతో మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది. ముందస్తు జాగ్రత్తగా వేటకు విరామం ప్రకటించి బోట్లు, వలలను సురక్షిత ప్రదేశాల్లో భద్రపరుచుకోవడంలో నిమగ్నమయ్యారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో రెండు రోజులుగా మత్స్యకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు.
కంట్రోల్ రూమ్
ఫోన్ నంబర్
08942-240557
Comments
Please login to add a commentAdd a comment