● భయపెడుతున్న పులి
సంతబొమ్మాళి మండలంలోని హనుమంతునాయుడుపేట పంచాయతీ పెద్దకేశనాయుడుపేటలో పులి తిరుగుతోందంటూ ప్రచారం జరుగుతుండటంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గుర్తు తెలియని జంతువు దాడిలో భద్రాచలం శాంతమూర్తికి చెందిన ఆవు గురువారం మృతి చెందడంతో స్థానికులు మరింతగా ఆందోళనకు గురవుతున్నారు. సమచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 14 ఇంచీల పొడవు ఉన్న జంతువు పాదముద్రలు పెద్ద మగపులిగా భావిస్తున్నారు. ఈ మేరకు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తహసీల్దార్ ఆర్.రమేష్ కుమార్‌కు సమాచారం అందించి పరిసర ప్రాంత గ్రామాల్లో దండోరా వేయిస్తున్నారు. కార్యక్రమంలో నరసన్నపేట ఫారెస్ట్ రేంజర్ జి.జగదీశ్వర్, నౌపడ ఎస్సై జి.నారాయణస్వామి, ఏసీఎఫ్ ఎ.వి.నాగేంద్ర, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జనప్రియ, ఎఫ్‌ఎస్‌ఓ నరేంద్ర, వెటర్నరీ డాక్టర్ అప్పలసూరి, రెవెన్యూ, సచివా లయ సిబ్బంది పాల్గొన్నారు. ఒడిశా నుంచి మందస మండలం మీదుగా సంతబొమ్మాళి మండలంలోకి పులి చేరుకుందని కాశీబుగ్గ ఫారెస్టు అధికారి మురళీకృష్ణ తెలిపారు. –సంతబొమ్మాళి
Comments
Please login to add a commentAdd a comment