శ్రీకాకుళం
● వణికిస్తున్న చలి
శుక్రవారం శ్రీ 29 శ్రీ నవంబర్ శ్రీ 2024
తుఫాన్ ప్రభావంతో జిల్లా వాసులను చలి వణికిస్తోంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతమైన పాతపట్నం, పరిసరప్రాంతాలలో నాలుగు రోజులుగా తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. ఐదు రోజు కిందట పాతపట్నంలో కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీలు ఉండగా.. గురువారం నాటికి 11 డిగ్రీలకు తగ్గింది. దీంతో రాత్రులే కాకుండా పగలు కూడా చలికి వణుకుతున్నారు. శ్రీకాకుళం, సారవకోట మార్గమంతా మంచుతో కప్పేసి ఉండటంతో రాకపోకలకు వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటలైనా మంచు కురుస్తుండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక అవస్థలు పడుతున్నారు. మధ్యాహ్నం కాస్త ఎండ కాస్తున్నా సాయంత్రం 4 గంటలకే శీతల గాలులు వీస్తున్నాయి. దీంతో చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు. –పాతపట్నం
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment