దేశం కోసం పనిచేసే నాయకుడు మోదీ | Sakshi
Sakshi News home page

దేశం కోసం పనిచేసే నాయకుడు మోదీ

Published Fri, May 10 2024 5:30 PM

దేశం కోసం పనిచేసే నాయకుడు మోదీ

సూర్యాపేట : దేశం కోసం నిజాయితీగా పనిచేసే నాయకుడు నరేంద్ర మోదీ అని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. గురువారం సూర్యాపేటలో బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావుతో కలిసి ప్రచార ర్యాలీలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ముస్లిం మహిళల కోసం త్రిబుల్‌ తలాక్‌ తీసుకురావడం, చేతివృత్తులు చేసుకునే నిరుపేదల కోసం విశ్వకర్మ యోజనతో ఆర్థిక రుణాలు అందించడం, 370 ఆర్టికల్‌ రద్దుచేసి కశ్మీర్‌ ను భారతదేశ అంతర్భాగంలో కలిపిన చరిత్ర కూడా ప్రధాని మోదీదేనన్నారు. నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గంలో 100శాతం గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్ల కేసీఆర్‌ పాలనలో తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుటుంబ పాలన అంతం కావాలంటే మరోసారి మోదీ ప్రధాని కావాలన్నారు.

ఫ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌

Advertisement
 
Advertisement
 
Advertisement