నేటి నుంచి అర్వపల్లి దర్గా ఉర్సు
అర్వపల్లి: అర్వపల్లి సమీపంలోని హజ్రత్ సయ్యద్ ఖాజా నసీరుద్దీన్‌బాబా దర్గా ఉర్సు శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జరగనుంది. శుక్రవారం సాయంత్రం 4గంటలకు అర్వపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గంధం ఊరేగింపు మొదలై రాత్రి 9గంటల వరకు దర్గాకు చేరుకుంటుంది. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. రాత్రి ఖవ్వాలీ కార్యక్రమం ఉంటుందని, శనివారం సాయంత్రం దీపారాధన (చిరాగ్) కార్యక్రమం జరుగుతుందని వక్ఫ్‌బోర్డు సూర్యాపేట జిల్లా ఇన్‌స్పెక్టర్ మహమూద్, దర్గా ముజావర్ సయ్యద్ అలీ తెలిపారు.
పూర్తయిన ఏర్పాట్లు..
ఏడాదికోసారి జరిగే ఈ ఉర్సుకు రాష్ట్రం నలుమూలల నుంచి హిందూ, ముస్లింలు తరలిరానున్నారు. వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. రంగురంగుల లైట్లతో దర్గాతో పాటు దర్గా పరిసరాలను అలంకరించారు. దర్గా ఎదుట భక్తులు క్యూలైన్‌లో వచ్చేలా బారికేడ్లు ఏర్పాటు చేశారు. నీటి వసతి కల్పించారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఫార్మేషన్ రోడ్డుకు తాత్కాలికంగా మరమ్మతు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు తరలివచ్చి దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. గంధం ఊరేగింపు సందర్భంగా గంధం పాత్రలను ప్రజాప్రతినిధులు, పోలీసులు, వక్ఫ్‌బోర్డుతో పాటు వివిధ శాఖల అధికారులు ఎత్తుకొని గ్రామ శివారు వరకు ఊరేగింపులో పాల్గొంటారు. దర్గా వద్ద మరుగుదొడ్లు నిర్మించడంతో పాటు వీధిలైట్లు ఏర్పాటు చేశారు. ఉర్సు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సూర్యాపేట డీఎస్పీ రవి, నాగారం సీఐ రఘువీర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్థానిక ఎస్‌ఐ సీహెచ్. బాలకృష్ణ తెలిపారు. ఉర్సు ప్రశాంతంగా జరగడానికి భక్తులు, నిర్వాహకులు సహకరించాలని కోరారు.
ఏర్పాట్ల పరిశీలన..
దర్గా వద్ద ఏర్పాట్లను గురువారం వక్ఫ్ బోర్డు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌స్పెక్టర్ ఎస్‌కే మహమూద్, స్థానిక ఎస్‌ఐ బాలకృష్ణ పరిశీలించారు. శుక్రవారం గంధం ఊరేగింపు సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వారి వెంట దర్గా ముజావర్ సయ్యద్ అలీ, హబీబ్, గులాం షఫీ ఉన్నారు.
ఫ సాయంత్రం 4 గంటలకు
అర్వపల్లి పోలీస్ స్టేషన్ నుంచి
గంధం ఊరేగింపు
ఫ శనివారం దీపారాధన
ఫ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తిచేసిన నిర్వాహకులు
Comments
Please login to add a commentAdd a comment