నేడు మంత్రి ఉత్తమ్ పర్యటన
హుజూర్‌నగర్: రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి శుక్రవారం హుజూర్‌నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌లో ఉదయం 7:40 గంటలకు బయలుదేరి రోడ్డు మార్గాన బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఉదయం 8:15 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 9 గంటలకు హుజూర్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌లో దిగుతారు. 9 నుంచి 9:45 గంటల వరకు ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలను పరిశీలిస్తారు. ఉదయం 10:15 గంటలకు రోడ్డు మార్గాన పాలకవీడు మండలం అలింగాపురం చేరుకుంటారు. అక్కడ రూ.30 కోట్లతో నిర్మించే అలింగాపురం–గరిడేపల్లి రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. 10:55 గంటలకు రోడ్డు మార్గాన నేరేడుచర్లకు చేరుకుని 12 గంటల వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మంత్రి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మొత్తంగా రూ.19.55 కోట్లతో 10 పీఆర్ బీటీ రోడ్లకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు నేరేడుచర్ల నుంచి హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్‌కు బయలుదేరతారు. కాగా మంత్రి ఉత్తమ్ పర్యటన ఏర్పాట్లను గురువారం ఆర్‌డీఓ శ్రీనివాసులు, మున్సిపల్ వైస్ చైర్మన్ కోతి సంపత్‌రెడ్డి, తహసీల్దార్ నాగార్జున్‌రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ యరగాని గురవయ్య, ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ సోమపంగు రామారావు, జానపాటి కృష్ణయ్య, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ హుజూర్‌నగర్‌లో ఏర్పాట్లను
పరిశీలించిన ఆర్‌డీఓ
Comments
Please login to add a commentAdd a comment