హాస్టల్‌ విద్యార్థులందరికీ రగ్గులు అందిస్తాం | - | Sakshi
Sakshi News home page

హాస్టల్‌ విద్యార్థులందరికీ రగ్గులు అందిస్తాం

Published Fri, Nov 29 2024 12:55 AM | Last Updated on Fri, Nov 29 2024 12:54 AM

హాస్ట

హాస్టల్‌ విద్యార్థులందరికీ రగ్గులు అందిస్తాం

సూర్యాపేట టౌన్‌: జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు చలికి ఇబ్బంది పడకుండా అందరికీ రగ్గులు అందజేస్తామని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ పేర్కొన్నారు. చలికి హాస్టళ్లలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై సాక్షి విజిట్‌ నిర్వహించి శ్రీసంక్షేమంలో వణుకుశ్రీ శీర్షికన కథనాన్ని గురువారం ప్రచురించింది. దీనికి కలెక్టర్‌ స్పందించారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని కస్తూరి బజార్‌లో గల ఎస్సీ బి బాయ్స్‌ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా అని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటశాలలో సిద్ధంగా ఉన్న వంటలు, స్టాక్‌ రిజిస్టర్‌ ప్రకారం స్టోర్‌లో ఉన్న వస్తువులను పరిశీలించారు. విద్యార్థులకు రగ్గులు అందజేశారు. అలాగే ఎస్సీ బాలుర ఏ2, ఎస్సీ బాలుర బి2 హాస్టళ్లను తనిఖీ చేసి విద్యార్థులకు రగ్గులు అందించారు. ఈమూడు హాస్టళ్లలో 90మంది విద్యార్థులకు రగ్గులు అందజేశారు. జిల్లాలోని మరికొన్ని హాస్టళ్లలో 110 రగ్గులను విద్యార్థులకు అధికారులు అందజేశారు. జిల్లావ్యాప్తంగా 23 మండలాల్లో 500 పంపిణీ చేయాలని నిర్ణయించారు. వీటిలో గురువారం 200 పంపిణీ చేశారు. మిగితావి రెండు రోజుల్లో అందజేయనున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వండిన ఆహారాన్ని మెస్‌ కమిటీ తిన్న తర్వాతే విద్యార్థులకు పెట్టాలన్నారు. మిగతా వసతి గృహాల్లోని విద్యార్థులకు కూడా రగ్గులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్‌, డీఎస్సీడీఓ లత, కలెక్టరేట్‌ ఏఓ సుదర్శన్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ సాయి గౌడ్‌, తహసీల్దార్లు శ్యాంసుందర్‌ రెడ్డి, హరిచంద్ర ప్రసాద్‌, వార్డెన్‌ ఉప్పలయ్య పాల్గొన్నారు.

హాస్టల్‌ విద్యార్థుల

ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలి

ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ సూచించారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్‌లో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ప్రీ, పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్ల సంక్షేమ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వసతి గృహాల సంక్షేమ అధికారులు స్థానికంగా ఉంటూ రోజూ హాస్టళ్లను పరిశుభ్రంగా ఉంచాలని, మెనూ ప్రకారం ఆహారం అందించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన చందుపట్ల వార్డెన్‌పై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లలో మైనర్‌ రిపేర్ల నిమిత్తం రూ.లక్ష నిధులు కేటాయిస్తున్నట్టు, వెంటనే రిపేర్లు చేయించుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ పి.రాంబాబు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ అధికారులు లత, శంకర్‌, అనసూర్య తదితరులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

ఫ జిల్లా కేంద్రంలోని ఎస్సీ హాస్టళ్ల తనిఖీ

ఫ జిల్లాలో 200 మందికి

రగ్గులు అందజేత

No comments yet. Be the first to comment!
Add a comment
హాస్టల్‌ విద్యార్థులందరికీ రగ్గులు అందిస్తాం1
1/3

హాస్టల్‌ విద్యార్థులందరికీ రగ్గులు అందిస్తాం

హాస్టల్‌ విద్యార్థులందరికీ రగ్గులు అందిస్తాం2
2/3

హాస్టల్‌ విద్యార్థులందరికీ రగ్గులు అందిస్తాం

హాస్టల్‌ విద్యార్థులందరికీ రగ్గులు అందిస్తాం3
3/3

హాస్టల్‌ విద్యార్థులందరికీ రగ్గులు అందిస్తాం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement