ఉద్యమ స్ఫూర్తి ప్రతిబింబించేలా..
సాక్షి, యాదాద్రి : స్వరాష్ట్ర సాధన కోసం నినదించిన పోరుగడ్డ భువనగిరి.. దీక్షా దివస్‌కు సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 2009 డిసెంబర్ 9వ తేదీన చేపట్టిన ఆమరణ దీక్షను మరోసారి గుర్తు చేసుకుంటూ దీక్షా దివస్ భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి భువనగిరిలోని జగ్జీవన్‌రాం చౌరస్తాలో నిర్వహించే సభకు జిల్లా నలుమూలల నుంచి బీఆర్‌ఎస్ శ్రేణులను తరలించనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా మాజీ కోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్, మరికొందరు ముఖ్య నాయకులు గురువారం దీక్షా దివస్ వేదిక ప్రాంగణాన్ని పరిశీలించారు. దీక్ష దివస్‌ను విజయవంతం చేసేందుకు మూడ్రోజుల క్రితం మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, దీక్షా దివస్ ఇంచార్జ్ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, నాయకుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.
పార్టీలకు అతీతంగా పోరుబాట
తెలంగాణ మలిదశ ఉద్యమంలో భువనగిరి ముందుంది. ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గా పార్టీలకు అతీతంగా ప్రజలు పోరుబాటలో కదిలారు. కేసీఆర్ నాయకత్వంలో సాగిన తెలంగాణ సాధన ఉద్యమానికి మద్దతుగా ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌కు ఘన విజయం కట్టబెట్టారు.
నేడు బీఆర్‌ఎస్ దీక్షా దివస్
ఫ భువనగిరిలో సభ
ఫ ఏర్పాట్లను పరిశీలించిన నాయకులు
Comments
Please login to add a commentAdd a comment