డిసెంబర్ 14న జాతీయ లోక్‌అదాలత్
చివ్వెంల: జిల్లాలోని అన్ని కోర్టుల్లో డిసెంబర్ 14న జాతీయ మెగాలోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు, దీన్ని కక్షిదారులంతా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.గోవర్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో పోలీసులు, న్యాయవాదులకు లోక్ అదాలత్‌పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సంవత్సరాల తరబడి పరిష్కారానికి నోచుకోని కేసులను లోక్ అదాలత్‌లో రాజీమార్గంలో పరిష్కరించుకోవచ్చన్నారు. దీనివల్ల ఇరువర్గాల వారు గెలిచిన వారవుతారని, కాలం, ధనం వృథా కాకుండా ఉంటుందన్నారు. ఈ లోక్‌అదాలత్‌లో సివిల్, క్రిమినల్, విద్యుత్, బ్యాంకు, మోటార్ వెహికల్ యాక్టు వంటి కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. గత లోక్ అదాలత్‌లో వివిధ రకాల కేసుల పరిష్కారానికి ఎంతగానో కృషిచేసిన పోలీసులు, న్యాయవాదులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి శ్యామ్‌శ్రీ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి, జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్, ఏఎస్పీ నాగేశ్వర్‌రావు, డీఎస్పీలు, సీఐలు, పీపీలు, ఎస్‌ఐలు, కోర్టు కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.
ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోవర్ధన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment