పద్మశాలీల అభ్యున్నతికి పాటుపడాలి
సూర్యాపేట టౌన్: పద్మశాలీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడాలని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పద్మశాలి భవన్లో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం సూర్యాపేట పట్టణ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం మహోత్సవంలో పాల్గొని మాట్లాడారు. చేనేత వృత్తిని అభివృద్ధి పథంలో నడిపే బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలన్నారు. అనంతరం పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికై న మిట్ట కోల సతీష్ కుమార్‌తోపాటు కమిటీ ఉపాధ్యక్షులు కోట వీరయ్య, గంజి శ్రీనివాస్, తలిశెట్టి శ్రీనివాస్, తలిశెట్టి మారుతి, ప్రధాన కార్యదర్శిగా ఏలె ప్రభాకర్, సహాయ కార్యదర్శిగా పరకాల శ్రీనివాస్, కేతం వెంకన్న, పరకాల ప్రవీణ్, రెబ్బ శ్రీనివాస్, కోశాధికారిగా మిట్టగోల మధుబాబులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు షఫీ ఉల్లా, వెలుగు వెంకన్న, ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచంద్రరావు, జిల్లా అధ్యక్షురాలు నక్క రమాదేవి, నాగుల వాసు, సైదులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment