మెనూ పాటించకపోతే చర్యలు తప్పవు
ఆలేరురూరల్ : పట్టణంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలను గురువారం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం తయారుచేసిన వంటలను పరిశీలించారు. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, రోజూ ఎంతమందికి భోజనం చేస్తున్నారని వార్డెన్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం ఎలా ఉందంటూ ఆరా తీశారు. హాస్టల్‌లో నెలకొన్న సమస్యలపై తెలుసుకున్నారు. అలాగే వంట గదులను పరిశీలించారు. హాస్టల్‌లో సౌకర్యాలు కావాలంటే తన దృష్టికి తీసుకురావాలని వార్డెన్‌కు సూచించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, వంట గది, హాస్టల్ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందజేయాలని, లేనట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, నీలం పద్మ, తుంగ కుమార్, వెంకటస్వామి, బుగ్గ నవీన్, ఎజాజ్, శ్రీకాంత్, లోకేష్, లక్ష్మన్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
ఫ ప్రభుత విప్ బీర్ల ఐలయ్య
ఫ ఆలేరులోని జ్యోతిబా ఫూలే
గురుకుల పాఠశాల తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment