సూట్‌కేసుల తయారీ కంపెనీలో అగ్నిప్రమాదం
చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ పరిధిలోని బొర్రోళ్లగూడెం సమీ పంలో సూట్‌కేసులు, బ్యాగులు తయారుచేసే పరిశ్రమలో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక్కడ గతంలో డాంబర్ తయారుచేసే పరిశ్రమ ఉండగా.. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులు దానిని కొనుగోలు చేసి వాంటో సూట్‌కేసుల తయారీ కంపెనీ ప్రారంభించారు. గురువారం సాయంత్రం కార్మికులు సూట్‌కేసులు తయారుచేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన కార్మికులు బయటకు పరుగు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు.
మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది..
మంటలు సూట్‌కేసులు తయారుచేసే షెడ్డులోకి వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. దీంతో ఫైర్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో చౌటుప్పల్, హయత్‌నగర్, భువనగిరిల నుంచి మూడు ఫైరింజన్లతో ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని యాదాద్రి భువనగిరి జిల్లా ఫైర్ ఆషీసర్ మధుసూదన్‌రావు పర్యవేక్షణలో మంటలను అదుపులోకి తెచ్చారు.
మిషన్లు దగ్ధం..
మంటలు భారీగా ఎగిసిపడడంతో పరిశ్రమలోని ముడిసరుకుతో పాటు తయారుచేసిన సూట్‌కేసులు, బ్యాగులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. సూట్‌కేసులు తయారుచేసే యంత్రాలు సైతం అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఫ మూడు ఫైరింజన్లతో మంటలను
అదుపు చేసిన ఫైర్ సిబ్బంది
ఫ భారీగా ఆస్తి నష్టం,
ఫ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment