డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
నల్లగొండ రూరల్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. నల్లగొండలోని పరీక్ష కేంద్రాలను యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఉపేందర్‌రెడ్డి పరిశీలించారు.
కల్యాణలక్ష్మి నిధులు స్వాహా చేసిన వ్యక్తుల అరెస్ట్
నూతనకల్: తప్పుడు పత్రాలు సృష్టించి కల్యాణలక్ష్మి నిధులు స్వాహా చేసిన పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత వ్యక్తులను గురువారం అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ మహేంద్రనాథ్ తెలిపారు. నూతనకల్ మండల పరిధిలోని మాచనపల్లి, మిర్యాల గ్రామాల్లో అర్హులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందించకుండా తప్పుడు పత్రాలు సృష్టించి 10 మంది అనర్హులకు ఇచ్చినట్లు తహసీల్దార్ ఎం. శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసి పంచాయతీ కార్యదర్శులు వెన్న వెంకట్‌రెడ్డి, దేశమల్ల అనిల్‌తో పాటు మట్టిపల్లి సందీప్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
ట్రాన్స్‌ఫార్మర్లలోని
కాపర్ వైరు చోరీ
గుండాల: గుర్తుతెలియని వ్యక్తులు వ్యవసాయ బావుల వద్ద రెండు ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి కాపర్ వైరు చోరీ చేశారు. ఈ ఘటన గుండాల మండలం బూర్జుబావి గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగింది. రైతులు, విద్యుత్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండాల మండలంలోని బూర్జుబావి, జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం జీడికల్ గ్రామాల మధ్యన గల రైతుల వ్యవసాయ బావుల వద్ద రెండు ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి పగులగొట్టి కాపర్ వైరు ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం రైతులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లగా.. ట్రాన్స్‌ఫార్మర్లు పగిలి ఉండటం గమనించి లింగాల ఘణపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment