హుజూర్‌నగర్ : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఆదివారం పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం 9.30కు జాన్‌పహాడ్ చేరుకుంటారు. అక్కడ 10.30 వరకు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనితో కలిసి ఉర్సు ఏర్పాట్ల పర్యవేక్షణ, 10.30 నుంచి 11.30 వరకు నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాలపై సమీక్ష నిర్వహిస్తారు. 11.30 నుంచి 12.30 వరకు చెరువుతండాలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.45 కు హుజూర్ నగర్ చేరుకుని 1.30 వరకు హౌసింగ్ కాలనీ పనులపై సమీక్ష తర్వాతగవర్నమెంట్ ఐటీఐ బిల్డింగ్‌కు శంకుస్థాపన చేస్తారు. 2 నుంచి 2.30 వరకు లింగగిరి – కల్మల్ చెరువు డబుల్ రోడ్డుకు లింగగిరిలో శంకుస్థాపన, 2.30 నుంచి 3 వరకు అమరవరం – ఆలింగాపురం డబుల్ రోడ్డుకు అమరవరంలో శంకుస్థాపన, 3 నుంచి 3.30 వరకు మేళ్లచెరువు – చౌటపల్లి డబుల్ రోడ్డుకు చౌటపల్లిలో శంకుస్థాపన, 3.30 నుంచి 4.40 వరకు కోదాడ – మేళ్లచెరువు రోడ్డుపై కందిబండ వద్ద రెండు బ్రిడ్జిల పునర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 5 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు.
Comments
Please login to add a commentAdd a comment