షెడ్యూల్ ప్రకారం గ్రామసభలు నిర్వహించాలి
భానుపురి (సూర్యాపేట) : ఈనెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం గ్రామసభలు కచ్చితంగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. సోమవారం కలెక్టర్‌లో అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి ఆర్డీఓలు, ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులతో వెబెక్స్ ద్వారా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి 26న అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలపై గ్రామసభలు నిర్వహిస్తుందన్నారు. ఎక్కడా ప్రజలకు అసౌకర్యంగా కలగకుండా అధికారులందరూ జాగ్రత్తగా సభలు నిర్వహించాలన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయ నోటీసు బోర్డులో అర్హుల జాబితాను ప్రదర్శించాలని, గ్రామసభల్లో వచ్చే దరఖాస్తులను స్వీకరించి రిజిస్టర్‌లో రాయాలన్నారు. గ్రామసభ ముఖ్య ఉద్దేశం ప్రజలకు స్పష్టంగా వివరించాలన్నారు. ఈకాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీఓ వీవీ అప్పారావు, డీపీఓ నారాయణరెడ్డి, డీసీఎస్‌ఓ రాజేశ్వరరావు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment