ఫై్లఓవర్ బ్రిడ్జి నిర్మించకుండా చూస్తా
అర్వపల్లి: అర్వపల్లిలోని 365 హైవేపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించకుండా చూస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు. అర్వపల్లిలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించే యోచనను వెంటనే విరమించుకోవాలని కోరుతూ సోమవారం రేఖ చారిటబుల్ ఫౌండేషన్ ఫౌండర్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ బోయలపల్లి రేఖ .. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అర్వపల్లిలో ఫ్లైఓవర్ బిడ్జి నిర్మాణ ప్రతిపాదనలతో స్థానిక ప్రజలు పడుతున్న టెన్షన్‌పై ‘ఫ్లై ఓవర్ గుబులు’ అనే శీర్షికన సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనాన్ని ఆమె మంత్రికి చూపించారు. ఈ సందర్భంగా మంత్రి వెంటనే కేంద్రమంత్రి నితిన్ గడ్కరితో మాట్లాడి అర్వపల్లిలో ఫ్లైఓవర్ నిర్మించకుండా చూడాలని కోరినట్లు ఆమె తెలిపారు. ప్రజలకు ఎలాంటి నష్టం లేకుండా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారని రేఖ చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment