మధ్య తరగతికి ఊరట
జిల్లాకు క్యాన్సర్ నిర్ధారణ సెంటర్
ప్రతి జిల్లాకేంద్రంలో క్యాన్సర్ టేక్‌కేర్ సెంటర్‌ను నెలకొల్పనున్నారు. దీంతో జిల్లాలో క్యాన్సర్ బారినపడుతున్న రోగులకు వేగంగా వ్యాధి నిర్ధారణ జరిగి మరణాలు తగ్గే అవకాశముంది. ప్రస్తుతం జిల్లాలో 2వేలకు పైగా క్యాన్సర్ బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఇప్పటివరకు హైదరాబాద్‌కు వెళితేనే వ్యాధి నిర్ధారణ జరిగే అవకాశముంది. అలాగే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీలో ఏటా 150 మెడికల్ సీట్లు భర్తీ అవుతున్నాయి. బడ్జెట్‌లో ప్రతిపాదించిన విధంగా 75వేల సీట్లను పెంచితే ఇక్కడ మరిన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయి. తద్వారా మరికొందరు విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.
ఫ రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు
ఫ 7వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 5.30 లక్షల మంది వేతనేతర జీవులకు మేలు
ఫ వ్యవసాయ రంగానికి ప్రోత్సాహంతో
2,70,853 మంది రైతులకు ప్రయోజనం
ఫ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అందుబాటులోకి
రానున్న క్యాన్సర్ టేక్‌కేర్ సెంటర్
ఫ కేంద్ర బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు
సూర్యాపేట : పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జిల్లా ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులకు మేలు కలగనుంది. వ్యవసాయ రంగం, ఎంఎస్‌ఎంఈ (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్)ల బలోపేతానికి ప్రోత్సాహం ఊరటనిచ్చింది. ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్నెట్ సదుపాయం, మరిన్ని ఎంబీబీఎస్ సీట్లతో జిల్లాలోని విద్యార్థులకు వసతులతో పాటు మరిన్ని అవకాశాలు దక్కనున్నాయి. పప్పు దినుసుల కొనుగోలుకు ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు, కిసాన్ క్రెడిట్ కార్డుల రుణపరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచడంతో జిల్లా రైతాంగానికి లబ్ధి చేకూరనుంది. అయితే కిసాన్ సమ్మాన్ నిధి నిధులను పెంచే అవకాశముందని ప్రచారం జరిగినా.. మార్పులు లేకుండా అమలు చేయడం, కొత్తవారికి అవకాశం ఇవ్వకపోవడం నిరాశ కలిగించింది. మొత్తంగా మధ్యతరగతి ప్రజలకు పెద్దపీట వేస్తూ వారి కొనుగోలు శక్తిని పెంచేలా చేయడంతో వృద్ధికి ఊపునిచ్చేలా బడ్జెట్ రూపొందించినట్లు ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment