ప్రవర్తనా నియమాళిని పక్కాగా అమలు చేస్తున్నాం
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నామని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌లో కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో మొత్తం 2,682 ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్లు ఉన్నారని, వీరి కోసం 23 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికలకు జంబో బాక్సులు,పెద్ద బాక్సులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి.రాంబాబు, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ శ్రీనివాస రాజు, కలెక్టరేట్ ఏఓ సుదర్శన్ రెడ్డి, వేణు సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment