ఇది మధ్యతరగతి బడ్జెట్
హుజూర్‌నగర్ : ఇది మధ్యతరగతి బడ్జెట్ అని చెప్పవచ్చు. వేతన జీవుల వెతలు తీర్చే దిశలో బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయి. అయినప్పటికీ త్వరలో రానున్న నూతన ఆదాయపన్ను చట్టాన్ని అనుసరించి మాత్రమే పన్ను తగ్గింపు ప్రయోజనాలు స్పష్టమవుతాయి. కిసాన్ క్రెడిట్ రుణాల పరిమితిని పెంచడం వంటివి వ్యవసాయరంగ ప్రయోజనదాయక నిర్ణయాలు. ఇవి స్వాగతించదగినవి. ప్రతిపాదనలు వికసిత్ భారత్ లక్ష్యంగా పెట్టుకున్నా ఆ దిశలో విధానాలురూపొందించటం, అమలు చేయటం కీలకం.
– డాక్టర్ చందా అప్పారావు,
అర్థశాస్త్ర సహాయ ఆచార్యులు
Comments
Please login to add a commentAdd a comment