మధ్య తరగతికి మేలు
ఈ బడ్జెట్‌ను పూర్తిగా మధ్యతరగతి, అల్ప ఆదాయ వర్గాలు, పారిశ్రామిక వర్గాలు, వ్యాపార వర్గాలను దృష్టిలో పెట్టుకొని రూపకల్పన చేసినట్లుగా ఉంది. మధ్య దిగువ తరగతి ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి తీవ్రమైన కసరత్తు చేశారు. దేశ ప్రజలందరూ బడ్జెట్‌కి ముందు ఊహించినట్లుగా ఆదాయ పన్నులో బాగా రాయితీ ఉంటుందని అనుకున్నారు. కానీ దేశ ప్రజల ఊహల్ని మించి రూ.12 లక్షల ఆదాయం వరకు షరతులతో కూడిన పన్ను మినహాయింపు ఇవ్వటం తో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్య ద్వారా మధ్యతరగతి ఆదాయ వర్గాల కొనుగోలు శక్తి, సేవింగ్స్ బాగా పెరుగుతాయి. ఆ మేరకు పారిశ్రామిక ఉత్పత్తి కూడా గణనీయంగా పెరుగుతుంది.
– పెద్దిరెడ్డి గణేష్, బ్యాంక్‌రంగ నిపుణుడు
Comments
Please login to add a commentAdd a comment