మద్యం అమ్మితే రూ.50వేలు జరిమానా
ఆత్మకూర్ ఎస్: ఆత్మకూర్(ఎస్) మండలంలోని ఏనుబాములలో మద్యం విక్రయాలను నిషేధించాలని గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఎవరు మద్యం అమ్మినా రూ.50వేలు జరిమానా విధించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు, యువజన సంఘాలు, అఖిల పక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తగుళ్ల జనార్దన్ యాదవ్, కలకోట్ల సీతారాములు ,పసునూరి అంజి, కోడిమల నాగరాజు, సైదులు, పారేల్లి నవీన్, నరేష్, రాజు ,కృష్ణ, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఫ ఏనుబాముల గ్రామంలో తీర్మానం
Comments
Please login to add a commentAdd a comment