ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాలి
భానుపురి (సూర్యాపేట) : ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలో ఉన్న 20వేల మంది ఆర్టిజన్ల విద్యార్హతల ఆధారంగా కన్వర్షన్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ ఆధ్వర్యంలో సూర్యాపేటలోని ఎస్‌ఈ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిజన్ల కన్వర్షన్ వల్ల విద్యుత్ సంస్థలపై పెద్దగా ఆర్థిక భారం పడదని తెలిపారు. ఈ విషయమై గతంలో డిప్యూటీ సీఎం, ట్రాన్స్‌కో, డిస్కం సీఎండీలకు వినతిపత్రాలు అందజేయగా ప్రస్తుతం చర్చ నడుస్తోందన్నారు. కన్వర్షనా లేక స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం గ్రేడ్ చెంజ్, ఇంక్రిమెంట్లు ఇవ్వడమా అని చర్చ నడుస్తుందన్నారు. కన్వర్షన్ చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ల కన్వర్షన్ జేఏసీ జిల్లా చైర్మన్ మేడె మారయ్య, కన్వీనర్ కొండ నకులుడు, వైస్ చైర్మన్ చినపంగి తిరుపయ్య, డివిజన్ చైర్మన్ ఎం.డి. రహమాన్, కన్వీనర్ సంకేపల్లి దయాకర్, దోమట్టి మురహరి, వాంకుడోతు జీవన్, సీఐటీయు నాయకులు వెంకటనారాయణ, సీహెచ్.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment