‘మీ టికెట్’లో మన ప్రాంతం
ఉమ్మడి జిల్లాలో చోటు
కల్పించిన ప్రదేశాలు..
ఫ బోటింగ్ విభాగంలో నాగార్జునసాగర్‌లో బోట్ల ప్రయాణాలకు సంబంధించి నాగార్జునకొండకు వెళ్లేందుకు, జాలీట్రిప్స్‌కు పిల్లలకు పెద్దలకు టికెట్ రేట్ల వివరాలు, మిర్యాలగూడలోని చెరువులో బోటింగ్ రేట్ల వివరాలను మీటికెట్ యాప్‌లో ఉంచారు.
ఫ నాగార్జునసాగర్‌లో బుద్ధవనంలో పార్కింగ్ ఫీజు, ప్రవేశ రుసుం (పిల్లలకు పెద్దలకు) వివరాల ఉన్నాయి.
ఫ ఆలయాలు, విహారయాత్రల వివరాలు తెలిపేలా ప్రత్యేక యాప్
ఫ వాటి విశేషాలు, టికెట్ రేట్లు
తెలుసుకునే అవకాశం
ఫ ఆ యాప్‌లో నాగార్జునసాగర్,
యాదగిరిగుట్ట, మిర్యాలగూడకు చోటు
నాగార్జునసాగర్ : రాష్ట్రంలోని దేవాలయాల్లో దైవదర్శనాలు, విహారయాత్రల విశేషాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మీ టికెట్’ యాప్‌ను తీసుకొచ్చింది. తెలంగాణలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో దర్శనం, పార్కులు, కమ్యునిటీ హాల్స్, పర్యాటక స్థలాల్లో ఎంట్రీ ఫీజు, బోట్లలో ప్రయాణించేందుకు ఎంత రుసుం ఇలాంటి విషయాలు ఈ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా తెలుసుకోవచ్చు. ఈ యాప్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలు ప్రదేశాలను చేర్చారు.
యాప్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ డెలివరీ వారు రూపొందించిన ‘మీ టికెట్’ యాప్‌ను ముందుగా ఫ్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతరం ఫోన్ నంబర్ నమోదు చేసి అకౌంట్‌లో పిన్ నంబర్ జనరేట్ చేసుకోవాలి. మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని నమోదు చేసిన ఫోన్ నంబర్, పిన్ నంబర్ కొట్టి లాగిన్ కావాలి. లాగిన్ కాగానే అందులోని అన్ని అంశాలు మనకు కనిపిస్తాయి.
ఈ యాప్ లో ఏముంటాయంటే..
మీ టికెట్ యాప్ ద్వారా అన్ని రకాల టికెట్లను ఒకే ఫ్లాట్‌ఫాం పైకి తెచ్చారు. తెలంగాణలోని 15 ప్రముఖ దేవాలయాలు, 129 పార్కులు, 54 బోటింగ్ ప్రదేశాలు, జంతు ప్రదర్శనశాలలు, మెట్రో, ఆర్టీసీ, మ్యూజియాలు, ఫ్లే అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్స్‌కు సంబంధించి టికెట్లు తీసుకునే వెసులుబాటు కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment