సర్వేను పక్కాగా నిర్వహించాలి
నూతనకల్, మద్దిరాల: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన చేపట్టిన సర్వేను పక్కాగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. ఆదివారం నూతనకల్, మద్దిరాల మండలం పోలుమల్లలో సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సేద్యానికి పనికిరాని భూములను గుర్తించి నివేదికను తయారు చేయాలన్నారు. సాగు భూములకే రైతు భరోసా పడేలా చూడాలని ఆదేశించారు. ఆయనవెంట ఆయా మండలాల తహసీల్దార్లు ఎం.శ్రీనివాసరావు, అమీన్‌సింగ్, డీఈ చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.
సర్వేల వల్లే అర్హులకు
పథకాలు అందట్లే..
హుజూర్‌నగర్: ప్రభుత్వం చేస్తున్న సర్వేల వల్ల అర్హులైన పేదలు సంక్షేమ పథకాలు అందట్లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం హుజూర్‌నగర్‌లోని అమరవీరుల స్మారక భవన్‌లో నిర్వహించిన ఆ పాఈ్ట జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులందరికీ పథకాలు అందించాలని, రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జనవరి 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో జరిగే సీపీఎం 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు కొలిశెట్టి యాదగిరి రావు, ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మీ, జిల్లా, మండల, పట్టణ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.
కూలీలకు పనులు
కల్పించాలి
మునగాల: ఉపాఽధిహామీ పథకం కింద ఎక్కువ మంది కూలీలకు పనులు కల్పించేలా చర్యలు చేపట్టాలని డీఆర్‌డీఓ వి.అప్పారావు సూచించారు. ఆదివారం ఆయన మునగాల ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధిహామీ పనులకు సంబంధించిన అకౌంట్స్ డేటా ఎంట్రీ, పనుల ప్రగతి నివేదికను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబ్‌కార్డు ఉన్న ప్రతిఒక్కరి ఆధార్, బ్యాంకు అకౌంట్ సీడింగ్ త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. గ్రామసభల నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కె.రమేష్‌దీనదయాళ్, ఏపీఓ శైలజ, ఉపాధిహామీ టీఏలు, ఎఫ్‌లు పాల్గొన్నారు.
జాతీయ భావాలు
పెంపొందించాలి
సూర్యాపేట టౌన్: పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో జాతీయ భావాలు, నైతిక విలువలు పెంపొందించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నల్లగొండ విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ బంటు జనార్దన్ జీ అన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(టీపీయూఎస్) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ నగర సంఘ చాలక్ డాక్టర్ దాచేపల్లి సుధీర్ జీ, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ దండ మురళీధర్‌రెడ్డి, టీపీయూఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెల్లంకొండ రామ్మూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లింగంపల్లి హరిప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి యామా రమేష్, శ్రీధర్, సంతోష్‌కుమార్, జితేందర్‌రెడ్డి, శ్రీదేవి, శ్రీనివాస్‌రెడ్డి, రామినేని శ్రీనివాస్, శైలజ ,సోమశేఖర్, శ్రీనివాస్‌రావు, నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment