ఫ్లై ఓవర్ వద్దంటూ నిరసన
అర్వపల్లి: అర్వపల్లిలో ఎలాంటి అవసరంలేని ఫై ఓవర్ నిర్మించవద్దంటూ స్థానికులు ఆదివారం స్థానిక వై జంక్షన్‌లో హైవేపై నిరసన వ్యక్తం చేశారు. ఫ్లైఓవర్ నిర్మించి తమ జీవితాలను రోడ్డుపాలు చేయవద్దంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు, మాజీ జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్ మాట్లాడుతూ మూడేళ్ల కిందటే రెండు హైవేల విస్తరణ సందర్భంగా వందలాది మంది ఇళ్లు, దుకాణాలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మిస్తే కొత్తగా ఇళ్లు, దుకాణాలు నిర్మించుకున్న వారు మరలా నష్టపోతారన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు వెంటనే చొరవ తీసుకొని ఫ్లైఓవర్ నిర్మాణ యోచనను విరమించుకునేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈదుల వీరపాపయ్య, వనం రమేష్, మామిడాల రాజలింగం, దావుల లింగయ్య, గజ్జి శంకర్, డాక్టర్ కిరణ్, కె. నరేష్, పెద్దయ్య, కట్టెల కృష్ణ, నల్లగుంట్ల శ్రీనివాస్, బైరబోయిన సంతు, గిరి, పి. శ్రీనివాస్, కుంభం వెంకన్న, వేణు, అనిల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment