సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని క్లాక్‌టవర్ సెంటర్‌లో ఈనెల 21వ తేదీన బీఆర్‌ఎస్ నిర్వహించ తలపెట్టిన రైతు మహాధర్నా వాయిదా పడింది. పోలీసులు అనుమతి నిరాకరించడంతో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మధ్యపెడుతోందంటూ బీఆర్‌ఎస్ మహా ధర్నా చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొనేలా ప్రణాళిక రూపొందించింది. మహాధర్నా అనుమతి కోసం ఈ నెల 17వ తేదీన బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు దేవేందర్ పోలీసులకు దరఖాస్తు చేశారు. ధర్నాకు అనుమతించడంలేదని సోమవారం ఉదయం పోలీసులు లేఖ ఇచ్చారు. దీనిపై బీఆర్‌ఎస్ నేతలు సోమవారం మధ్యాహ్నం సమయంలో హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. పోలీసులు అనుమతి నిరాకరించిన విషయంలో ఇప్పుడే జోక్యం చేసుకోలేమని పేర్కొన్న హైకోర్టు.. ఈ కేసును ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది. దీంతో బీఆర్‌ఎస్ ధర్నాను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment