ఫ్లైఓవర్ నిర్మించొద్దని సర్వే అడ్డగింత
అర్వపల్లి : అర్వపల్లిలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సర్వే చేస్తున్న సిబ్బందిని సోమవారం స్థానికులు అడ్డుకొని నిలదీశారు. ఇప్పటికే రెండు జాతీయ రహదారుల విస్తరణ సందర్భంగా స్థానికంగా వందలాది ఇళ్లు, దుకాణాలను కోల్పోయామని, మళ్లీ ఎవరి కోసం ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. సర్వే వద్దంటూ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్వే కంపెనీ ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రధానంగా అర్వపల్లిలో వైజంక్షన్‌ను గతంలో ప్రకటించిన ప్రకారం అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బైరబోయిన సునీతరామలింగయ్యతోపాటు స్థానికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment