వరిసాగే అత్యధికం
యాసంగిలో 4.15 లక్షల ఎకరాల్లో సాగైన వరి
భానుపురి (సూర్యాపేట): జిల్లాలో యాసంగి పంటల సాగు జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు 4,15,749 ఎకరాల్లో జిల్లా రైతులు పంటలను సాగు చేశారు. ఇందులో ఎస్సారెస్పీ ఆయకట్టు మినహా అంతటా వరిసాగు ఊపందుకుంది. ఈ ఆయకట్టుకు నీటి విడుదల సక్రమంగా లేకపోవడంతో వేలాది ఎకరాలు భూములు బీడుగానే ఉన్నాయి. ఇక నాగార్జున సాగర్, మూసీ ప్రాజెక్టుల కింద ఆయకట్టు పరిధిలో ముమ్మరంగా వరినాట్లు సాగుతున్నాయి. జిల్లా అంతటా మరో వారం రోజుల పాటు నాట్లు పడే అవకాశం ఉంది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 4.15 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగ్గా.. మరో 30 వేల ఎకరాల వరకు నాట్లు పడనున్నాయి. ఆరుతడి పంటలు కేవలం 749 ఎకరాల్లోనే సాగు చేశారు.
సమృద్ధిగా నీరుండి..
వానాకాలం కొంత ఆలస్యంగానైనా భారీ వర్షాలే పడ్డాయి. చెరువులు, కుంటలు నిండడంతో పాటు జిల్లా రైతాంగానికి సాగు నీటిని అందించే మూసీ, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టులు సైతం నిండాయి. వానాకాలం సైతం ఎస్సారెస్పీ మినహా రెండు ప్రాజెక్టుల నుంచి సమృద్ధిగా నీరిచ్చినా యాసంగి సీజన్‌కు సరిపడా నిల్వలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూడు ప్రాజెక్టుల నుంచి వరి సాగు కోసం నీటిని విడుదల చేశారు. సాగర్, మూసీ ప్రాజెక్టులకు ముందుగానే నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల పరిధిలో వరిసాగు జోరుగా సాగుతోంది. ఇప్పటికే వరినాట్లు చివరి దశకు చేరాయి. 20223–24 యాసంగి సీజన్‌కు కంటే దాదాపు 10వేల ఎకరాల్లో ఇప్పటికే అధికంగా రైతులు వరి సాగు చేశారు. మరో వారం రోజుల పాటు నాట్లు కొనసాగనుండడంతో వరిసాగు మరింత పెరిగే అవకాశముంది.
వెదజల్లే పద్ధతిలో సాగుచేసిన వరిపైరు
వరి
జొన్నలు
చిరుధాన్యం
మొక్కజొన్న
4,15,000
21
260
ఎస్సారెస్సీ ఆయకట్టులో అంతంతే..
బోరు, బావుల కింద చాలామంది రైతులు డ్రమ్ సీడర్, వెదజల్లే పద్ధతిని అవలంబించడంతో సాగు పూర్తయింది. సాగర్, మూసీ కింద ముమ్మరంగా సాగుతుండగా.. ఎస్సారెస్సీ ఆయకట్టుకు సరిపడా నీటిని విడుదల చేయడం లేదు. దీంతో ఈ ప్రాంతంలో వరి సాగు అంతంత మాత్రంగానే ఉంది. జనవరి 1వ తేదీ నుంచి వారబందీ పద్ధతిన నీటిని విడుదల చేసినా.. ఇప్పటి వరకు చివరి ఆయకట్టుకు నీరందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గతేడాది కన్నా దాదాపు 94,498 ఎకరాల్లో వరి సాగు అధికంగా ఉంటుందని అధికారులు భావించినా.. ఆ స్థాయిలో వరి సాగు జరిగే అవకాశం లేనట్లు అంచనా. ఆరుతడి పంటల్లో అత్యధికంగా వేరుశనగ 350 ఎకరాలు, మొక్కజొన్న 260 ఎకరాల్లో సాగైంది. పెసర కేవలం 25 ఎకరాల్లో మాత్రమే రైతులు సాగు చేశారు.
ఫ మరో 30 వేల ఎకరాలు నాట్లకు సిద్ధం
ఫ కేవలం 749 ఎకరాల్లోనే ఆరుతడి పంటలు
ఫ వారం రోజుల్లో పూర్తికానున్న పంటల సాగు
Comments
Please login to add a commentAdd a comment