![డక్కిలి: గొబ్బెమ్మను ఊరేగింపుగా
తీసుకెళుతున్న మహిళలు - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/19/18vgr82-410002_mr_0.jpg.webp?itok=YWQlsDxs)
డక్కిలి: గొబ్బెమ్మను ఊరేగింపుగా తీసుకెళుతున్న మహిళలు
డక్కిలి: పోయి రావమ్మా.. గౌరమ్మా అంటూ గొబ్బిపాటలు పాడుతూ గౌరమ్మను గురువారం ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. మండలంలోని దగ్గవోలు, భీమవరం, పాతనాలపాడు (కమ్మవారిపల్లె), చాపలపల్లె, సంగనపల్లె తదితర గ్రామాల్లో గొబ్బెమ్మ పండగను మహిళలు ఉత్సాహంగా జరుపుకున్నారు. కుమ్మరింట చేసిన గౌరీదేవి ప్రతిమను గ్రామంలో ఏర్పాటు చేసిన వేపాకుల మండపంలో కొలువుదీర్చి పూజలు చేశారు. అనంతరం పొంగళ్లు పెట్టి నైవేద్యం సమర్పించారు. తరువాత గొబ్బెమ్మను మేళతాళాల నడుమ గ్రామ చావిడి వద్ద నిలిపి పాటలు పాడుతూ సందడి చేశారు. గొబ్బెమ్మను ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువుల్లో నిమజ్జనం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment