దీపావళికి 4 రోజులు సెలవు | - | Sakshi
Sakshi News home page

దీపావళికి 4 రోజులు సెలవు

Published Sun, Oct 20 2024 2:56 AM | Last Updated on Sun, Oct 20 2024 2:56 AM

-

సాక్షి, చైన్నె : దీపావళి పండుగకు నాలుగు రోజులు సెలవు కలిసి వచ్చాయి. సీఎం స్టాలిన్‌ నిర్ణయంతో సెలవుల సంఖ్య పెరిగినట్లయ్యింది. ఈనెల 31వ తేదీన దీపావళి పండుగను జరుపుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇంటిళ్లి పాది ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ పండుగకు ఈసారి ఒకే రోజు సెలవు వచ్చింది. గురువారం పండుగ కావడం, శుక్రవారం పని దినం కావడంతో స్వస్థలాలకు వెళ్ల లేక సతమతం అయ్యే పరిస్థితి ఏర్పడింది. దీనిని గ్రహించిన సీఎం స్టాలిన్‌ నవంబర్‌ 1వ తేదీన శుక్రవారం సెలవు రోజుగా ప్రకటిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పండుగకు ఏకంగా నాలుగు రోజులు సెలవు దక్కినట్లయ్యింది. శని, ఆదివారాల సెలవులు కలిసి రావడంతో సర్వత్రా స్వస్థలాలకు వెళ్లి పండుగను జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ప్రత్యేక బస్సులను అదనంగా నడిపేందుకు రవాణా సంస్థ, 40 మేరకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ రైల్వే కసరత్తు చేపట్టింది. ఒకటిరెండురోజులలో ప్రత్యేక బస్సులు, రైళ్ల జాబితా వెలువడబోతున్నాయి. అదేసమయంలో నవంబర్‌ 1వ తేదీ సెలవును భర్తీ చేసే విధంగా అదే నెల 9వ తేదీని పనిదినంగా పరిగణించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీపావళి సందర్భంగా ఆరు కొత్తరకం పలహారాలను ఆవిష్కరించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ ఆవిన్‌ నిర్ణయించింది. 20 శాతం మేరకు పండుగ సందర్భంగా తమ ఉత్పత్తులను పెంచుకునేందుకు సిద్ధమైంది.

డీఎంకే ఎంపీ విల్సన్‌కు అస్వస్థత

కొరుక్కుపేట: డీఎంకే న్యాయవాది, ఎంపీ విల్సన్‌ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ని చైన్నెలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. అర్ధరాత్రి కిడ్నీ ఇన్ఫెక్షన్‌్‌ రావడంతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement