నేటి నుంచి స్కంధషష్టి
సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయా ల్లో స్కంధ షష్టి ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. వారం రోజుల పాటు కనులపండు వగా ఉత్సవాలు జరగనున్నాయి. వళ్లి, దేవసేన సమే త మురుగన్‌కు విశిష్ట పూజలు, కల్యాణ వేడుక నిర్వహించనున్నారు. రాష్ట్రంలో తమిళ్ కడవుల్‌గా మురుగ న్‌ను భక్తులు కొలుస్తుంటారు. ఇక్కడే ఆయనకు ఆ రుపడై వీడులుగా ప్రసిద్ధి చెందిన ఆలయాలు వెలసి ఉ న్నాయి. ఇందులో తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులో జయంతి నాదర్‌స్వామి ఆలయం, దిండుగల్ జిల్లా పళణిలోని దండాయుధపాణి, మదురై తిరుప్పరగుండ్రం సుబ్రహ్మణ్యస్వామి, తంజావూరు జిల్లా స్వామి మలైలోని స్వామినాథస్వామి ఆలయం, మదురై పళముదిర్ చోళైలో సోలైమలై మురుగన్, తిరుత్తణిలో మురుగన్ ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లో ప్రతి ఏటా స్కంధషష్టి ఉత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతాయి. ఉత్సవాలలో ముఖ్య ఘట్టం సూరసంహారం అద్వితీయంగా జరుగనుంది. ఈ ఉత్సవాలలో స్వామివారి కల్యాణోత్సవ ఘట్టం మరింత కనులపండువగా జరుగుతాయి. తిరుచెందూరు, పళణి ఉత్సవాలు మరింత అంబరాన్ని తాకుతాయి. తిరుచెందూరులో జరిగే సూరసంహారం ఘట్టం తిలకించేందుకు లక్షల్లో భక్తులు తరలి వస్తారు. పళణి కొండపై దండాయుధపాణికి జరిగే కల్యాణ మహోత్సవం మరింత వేడుకగా జరుగనుంది. ఈ స్కంధషష్టి ఉత్సవాలకు మురుగన్ ఆలయాలలో శనివారం శ్రీకారం చుట్ట నున్నారు. తిరుచెందూరులో సూర సంహార ఘట్టం ఈనెల 7న సముద్ర తీరంలో జరగనుంది. ఉత్సవాల కోసం తిరుచెందూరు సిద్ధమైంది. సముద్ర తీరం వెంబడి భక్తులకు రక్షణగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు తిరుచెందూరుకే అత్యధికంగా భక్తులు పోటెత్తడం జరుగుతుండడంతో ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. సముద్ర తీరంలో, ఆలయ పరిసరాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తూత్తుకుడి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment