విజయ్ 69వ చిత్రం రెండో షెడ్యూల్‌కు రెడీ
తమిళసినిమా: కోలీవుడ్‌లో వసూళ్ల కింగ్‌గా మారిన న టుడు విజయ్. ఈయన చిత్రాలు జయపజయాల కతీతంగా లాభాల పంట పండిస్తాయి. నిజం చెప్పాలంటే విజయ్ ఇటీవల నటించిన లియో చిత్రం ఆ శించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయినా ఈ రెండు చిత్రాలు ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్ల కు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. కాగా తాజాగా విజయ్ తన 69వ చిత్రంలో నటిస్తున్నారు. ఇదే ఈ యన చివరి చిత్రంగా ప్రచారం జరుగుతుంది. అందుకు కారణం విజయ్ పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారిస్తుండటమే. కాగా ఈ యన చివరి చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వ హిస్తున్నారు. విశేషమేమిటంటే ఈ యన ఈ కథను ముందుగా నటు డు కమలహాసన్ కోసం తయా రు చేశారు. అ యితే కొన్ని కా రణాలతో ఈ కథలో కమలహాసన్ నటించలేదు. అదే కథలో విజయ్ నటిస్తుండంతో చిత్రంపై ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా ఇది విజయ్ రాజకీయ జీవితానికి ప్రయోజనం చేకూర్చేలా సమకాలిన రా జకీయాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుంద ని సమాచారం. కాగా పూజా హెగ్డే నటిస్తున్న ఇందు లో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల మొదలై కేవలం మూడు రోజులు మాత్రమే జరుపుకుంది. త్వరలో రెండో షెడ్యూల్ షూటింగ్‌కు యూనిట్ వ ర్గాలు రెడీ అవుతున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్ ప్రారంభ దశలో ఉండగానే వ్యాపార పరంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. చిత్రం విదేశీ విడుదల హక్కులను పార్స్ ఫిలిం సంస్థ రూ.78 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇదే సంస్థ ఇంతకుముందు లియో, గోట్ చిత్రాలను విదేశీ విడుదల హక్కులను సొంతం చేసుకున్న విషయం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment