ఆరుపడై వీడులలో నేడు సూర సంహారం
● నిఘానీడలో తిరుచెందూరు
సాక్షి, చైన్నె: తమిళ్ కడవులు మురుగన్‌కు తమిళనాట ఉన్న ఆరు పడై వీడుల్లో జరుగుతున్న స్కంధ షష్టి మ హోత్సవాలలో భాగంగా గురువారం సూరసంహార ఘట్టం జరగనుంది. తిరుచెందూరులో సాగర తీరంలో ఈ అద్వితీయ ఘట్టం నిర్వహించనున్నారు. లక్షలాది గా భక్తులు తరలి రానున్న నేపథ్యంలో తిరుచెందూరు ను నిఘా నీడలోకి తీసుకొచ్చారు. వివరాలు.. రాష్ట్రంలో సుబ్రహ్మణ్య స్వామికి ఆరుపడై వీడులుగా ఆలయాలలు ఉన్న విషయం తెలిసిందే. ఇందులో రెండవదిగా ప్రసిద్ధి చెందిన తిరుచెందూరులో స్కంధ షష్టి ఉ త్సవాలు కనుల పండువగా జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భాగంగా శనివారం నుంచి ఆలయంలో ప్ర త్యేకపూజాది కార్యక్రమాలు, యాగశాల పూజలు జరుగుతూ వస్తున్నాయి. ఈ ఉత్సవాలలో ముఖ్యఘట్టం గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు జరగనుంది. సముద్ర తీరంలో అత్యంత ముఖ్య ఘట్టం సూర సంహారం లక్షలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల నడుమ జరగనుంది. అద్వితీయంగా జరిగే ఈ ఘట్టాన్ని తిలకించేందుకు బుధవారం సాయంత్రం నుంచి భక్త జనం తిరుచెందూరు వైపుగా కదిలా రు. దీంతో తిరుచెందూరుకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. తాంబరం నుంచి ప్రత్యేక రైలును సైతం ప ట్టాలెక్కించారు. లక్షలాదిగా భక్తులు సూర సంహారాని కి తరలి రానుండడంతో సాగర తీరంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భక్తులు సముద్రంలోకి వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆలయం పరిసరాలలో 13 చోట్ల భద్రతా గోపురాలు ఏర్పాటు చేశారు. 100 చోట్ల నిఘా నేత్రాలను ఏర్పాటు చేసి కంట్రోల్ రూం నుంచి పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నారు. డీ ఐజీ మూర్తి, ఎస్పీ అల్బర్ట్ జాన్, డీఎస్పీ వసంతరాజ్ నేతృత్వంలోని పోలీసు అధికారులు తిరుచెందూరులో తిష్ట వేసి ఉన్నారు. సముద్ర తీరంలో ఇనుప పైపులతో బారికేడ్లను ఏర్పాటు చేయడమే కాకుండా, భక్తులు కూ ర్చుని ఉత్సవాన్ని తిలకించేందుకు వీలుగా గ్యాలరీల తరహాలో ఏర్పాట్లు జరిగాయి. తిరుచెందూరు సూర సంహార ఘటానికి ప్రత్యేక గాధ ఉన్నప్పటికీ, మిగిలిన ఆరుపడై వీడులలోనూ సూర సంహార ఘట్టాలు నిరాడంబరంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment