ఎల్లప్పుడూ మీలో ఒకడినే..!
● మరింత మద్దతివ్వాలని ప్రజలకు సీఎం స్టాలిన్ పిలుపు ● పెరియార్ పేరిట గ్రంథాలయం ● కోయంబత్తూరు పర్యటనలో వెల్లడి ● తమిళనాడును నంబర్–1గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రకటన
ద్రవిడ మోడల్ ప్రజలతో మమేకం..
ప్రతి నియోజకవర్గానికి, ప్రతి ఊరికి, ప్రజలకు అవసరమైన స్థానిక సమస్యలను అధ్యయనం చేసి, ప్రత్యేక పథకం, ప్రాజెక్టులుగా వాటిని అమలు చేయబోతున్నామన్నారు. ప్రజల జీవితాలతో ద్రావిడ మోడల్ ప్రభుత్వ పథకాలు మిళితమయ్యాయని, ఓటు వేసిన వారికి, వేయని వారికి కూడా పథకాలను విస్తృతంగా దరి చేర్చి ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇది ప్రజల ప్రభుత్వం అని, అందుకే ప్రజలు తమను ఆదరిస్తూ వస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా ప్రజాహితం, ఆధునిక తమిళనాడే లక్ష్యంగా ప్రత్యేక విజన్‌తో దూసుకెళ్తున్నామన్నారు. 50 ఏళ్ల క్రితం ఉత్తరాది రాష్ట్రాల వైపుగాచూసే వారమని, ఇప్పుడు తమిళనాడు ఎలా ఉందో ఒక్క సారి ఆలోచించండి అని సూచించారు. ఉత్తరాదిని తలదన్నే విధంగా తమిళనాడు దేశంలోనే రెండవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా మారిందన్నారు. దీనిని తొలి స్థానంలోకి తీసుకెళ్లడమే లక్ష్యం అని, విద్య, వైద్యం, పర్యాటకం, పారిశ్రామికం, వంటి రంగాలలో అగ్రగామిగా ఉందని గుర్తు చేశారు. సచివాలయంలో కూర్చుని పాలన చేయడం తన పద్ధతి కాదని, అందుకే ఫీల్డ్‌లో ఎల్లప్పుడూ ఉంటూ వస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమాలలో మంత్రులు కేఎన్ నెహ్రూ, ఏవీ వేలు, ముత్తుస్వామి, స్వామినాథన్, సెంథిల్ బాలాజీ, అన్బిల్ మహేశ్ పొయ్యామొళి, కయల్వెలి సెల్వరాజ్, ఎంపీలు అందియూరు సెల్వరాజ్, గణపతి బి రాజ్‌కుమార్, ఈశ్వర స్వామి, బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్, ప్రభుత ప్రధాన కార్యదర్శి మురుగానందం, కలెక్టర్ క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సాక్షి, చైన్నె: సీఎం స్టాలిన్ పర్యటన కోయంబత్తూరులో బుధవారం కూడా కొనసాగింది. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ వారంలో ఒక రోజు పూర్తిస్థాయిలో పార్టీ కార్యక్రమాలకు తమను అంకితం చేసుకోవాలని, ఇంటింటా వెళ్లి ప్రజలతో మమేకం కావాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు ఇంటింటా దరిచేరాయా..? అని పరిశీలించడమే కాకుండా, దక్కని వారికి దరి చేర్చాలని సూచించారు. రాత్రి రేస్ కోర్సు గెస్ట్ హౌస్‌లో బస చేసిన సీఎం స్టాలిన్ ఉదయాన్నే రెండవ రోజు పర్యటన చేపట్టారు. కోయంబత్తూరులోని పట్టర్ పాళయంలో రూ. 300 కోట్లతో తందై పెరియార్ గ్రంథాలయం, సైన్స్ సెంటర్ భవన నిర్మాణ పనులకు శంకు స్థాపన చేశారు. గాంధీపురంలో నిర్మాణంలో సెమ్మొళి పార్కు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టర్ పాళయంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులను కలిసినప్పుడల్లా తనకు కొత్త ఉద్వేగం, శక్తి కలుగుతోందని వ్యాఖ్యలు చేశారు. 2021లో అధికారం చేపట్టిన తర్వాత ప్రతి జిల్లాలో తాను పర్యటించానని, కార్యక్రమాలు వేగవంతం చేశానని వివరించారు. గత ఏడాది రాష్ట్రంలోని రీజియన్ల వారిగా నాలుగైదు జిల్లాలను కలుపుతూ సమీక్షలు, సమావేశాలు నిర్వహించానని, అయితే, ఈ సారి అన్ని జిల్లాలలో పర్యటన విస్తృతంగా ఉంటుందన్నారు.
అన్ని అంశాలపై సమగ్ర పరిశీలన
జిల్లాల పర్యటన కేవలం సమీక్షలు, సమావేశాలకే పరిమితం కాదని, ప్రజల సమస్యలు, డిమాండ్ల అధ్యయనంకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు వంటి కార్యక్రమాలు తన నేతృత్వంలో జిల్లాలో విస్తృతం అవుతాయని వివరించారు. కోయంబత్తూరు జిల్లాకు ప్రభుత్వ పథకాలను మరింత మెరుగ్గా , వేగంగా అమలు చేయడానికి మంత్రి సెంథిల్ బాలాజీ ‘కమ్‌బ్యాక్’ అంటూ వచ్చేశారని కితాబు ఇచ్చారు. దివంగత నేత కరుణానిధిని స్మరిస్తూ శత జయంతి కార్యక్రమాలలో భాగంగా మదురైలో బ్రహ్మాండ గ్రంథాలయం నిర్మించామని గుర్తు చేస్తూ, ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారి ఉందన్నారు.
కోయంబత్తూరులో తొలుత గ్రంథాలయం ఏర్పాటుకు నిర్ణయించినా, సైన్స్ సెంటర్‌ను కూడా అదనంగా ప్రస్తుతం చేర్చామన్నారు. చైన్నెలో దివంగత నేత అన్నాపేరిట, మదురైలో కరుణానిధి పేరిట బ్రహ్మాండ గ్రంథాలయాలు ఉన్న దృష్ట్యా, కోయంబత్తూరులో నిర్మించనున్న ఈ భవనానికి ద్రవిడ సిద్ధాంతకర్త తందై పెరియార్ పేరు పెట్టేందుకు నిర్ణయించామని ప్రకటించారు. 2026 జనవరిలో ఈ గ్రంథాలయం, సైన్స్‌సెంటర్ ప్రారంభోత్సవం జరుగుతుందని స్పష్టం చేశారు. రూ. 133 కోట్లతో గాంధీపురంలో కోయంబత్తూరుకు మరో ఐకానిక్‌గా రూపుదిద్దుకుంటున్న సెమ్మొళి పార్కు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. జూన్‌లో దీనిని ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా బంగారు ఆభరణాల ఉత్పత్తికి కేంద్రంగా కోయంబత్తూరును తీర్చిదిద్దే విధంగా ఇక్కడ కురిచ్చిలోని పారిశ్రామిక వాడలో రూ.126 కోట్లతో బంగారు ఆభరణాల ఉత్పత్తి కాంప్లెక్స్ త్వరలో రూపుదిద్దుకుంటుందని ప్రకటించారు.
భారీగా కొత్త ప్రాజెక్టులు..
దేశంలోని తొలి వ్యవసాయ వర్సిటీ కోయంబత్తూరు లో ఉందని గుర్తు చేస్తూ, రోడ్లు, రహదారులు, వంతెనలు, తాగునీటి ప్రాజెక్టులు, టైడల్ పార్కులు.. ఇలా ఎన్నో ప్రాజెక్టులను విజయవంతం అమలు చేశామ ని గుర్తు చేశారు. రూ. 1,848 కోట్లతో విమానాశ్ర యం విస్తరణకు స్థల సేకరణ పూర్తి చేశామని, త్వర లో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించనున్నామన్నారు. రూ.300 కోట్లతో రవాణా పా ర్క్, రూ. 260 కోట్లతో విమానయాన శాఖ ఇండస్ట్రియల్ పార్కు సూలూరు వద్ద త్వరలో ప్రారంభం కా బోతోందన్నారు. అలాగే చైన్నెలోని అంతర్జాతీయ క్రి కెట్ స్టేడియం తరహాలో కోయంబత్తూరులోనూ స్టే డియంకు స్థలం సిద్ధం చేశామని, త్వరలో పనులు ప్రారంభం కాబోతున్నాయన్నారు. ఇక్కడి ప్రజల వి జ్ఞప్తులు, సమస్యలను అధ్యయనం చేసి, వీలైన త్వర గా పరిష్కరించే విధంగా అధికారులను ఆదేశించామన్నారు. ఐటీ క్యాంపస్ నిర్మాణం, తొండముత్తూరులో ఏనుగుల భారీ నుంచి గ్రామీణ ప్రజలను ర క్షించేందుకు రూ. 7 కోట్లతో ఆధునిక భద్రత కంచె ఏర్పాటు చేస్తామన్నారు. కొట్టూరు, వేడెట్టకారన్‌పుత్తూరు, ఓడై కులం తదితర మునిసిపాలిటీలు, ఆనమలై పంచాయతీ యూనియన్ పరిధిలోని గ్రామాల కు రూ. 26 కోట్లతో ఉమ్మడి తాగునీటి పథకాన్ని అప్ గ్రేడ్ చేస్తున్నామన్నారు. తొలి రోజు పర్యటనలో వివి ధ వర్గాల ప్రజల అభ్యర్థనకు ప్రతిస్పందనగా కో యంబత్తూరు కార్పొరేషనన్‌లో ఎన్నో ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని రోడ్లు, భూగర్భ మురుగు నీటి కాలువలను రూ. 200 కోట్ల ప్రత్యేక ప్రాజెక్ట్ పనులు చేపట్టబోతున్నామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment