అంత్యక్రియల సమయంలో..
● టపాకాయలు మీదపడి యువకుడి మృతి
అన్నానగర్: అంత్యక్రియల సమయంలో బాణ సంచా మీద పడి యువకుడు మృతి చెందాడు. కడలూరు జిల్లా గో.పవళంగుడి గ్రామానికి చెంది న హరికృష్ణన్ కుమారుడు ఆకాష్ (18) డప్పు క ళాకారుడు. రెండు రోజుల కిందట అదే ప్రాంతా నికి చెందిన హంసాయల్(90) అనే వృద్ధురాలు మృతి చెందింది. ఈమె అంత్యక్రియలకు డ్రమ్స్ వాయించడానికి ఆకాష్ వెళ్లాడు. మంగళవారం మధ్యాహ్నం ఆయన డ్రమ్ వాయిస్తుండగా అక్కడికి వచ్చిన కొందరు బాణసంచా పేల్చారు. కొ న్ని టపాకాయలు ఎగిరి ఆకాష్ తలపై పడి పేలిపోయాయి. తీవ్రగాయాలైన ఆకాశ్ అక్కడికక్కడే మరణించాడు. అలాగే అదే ప్రాంతానికి చెందిన నితీష్ (23), సుందరమూర్తి (63) గాయపడ్డారు.
అయ్యప్ప మాల వేసే ముందు..
● అతిగా మద్యం తాగి వ్యక్తి..
అన్నానగర్: అయ్యప్ప మాలధారణ చేసే ముందు అతిగా మద్యం తాగి ఓ వ్యక్తి మరణించాడు. కృష్ణగిరి జిల్లా కొనకుట్టైకి చెందిన శివ, చాముండేశ్వరి దంపతులకు మణికంఠన్(32) కుమారుడు ఉన్నాడు. ఇతడు భవన నిర్మాణ కార్మికుడు. ఇతని కి మద్యం తాగే అలవాటు ఉండేది. మణికంఠన్ అయ్యప్ప మాల వేయాలని భావించాడు. మాల వేసుకుంటే మద్యం తాగలేమని గుడికి వెళ్లే ముందు మణికంఠన్ మద్యం తాగాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వరుసగా రెండు రోజుల పా టు అతిగా మద్యం సేవించాడు. అలాగే మాంసాహారం ఎక్కువగా తీసుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 4.45 గంటలకు మణికంఠన్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యా డు. వెంటనే చుట్టుపక్కల వారు అతడిని చికిత్స నిమిత్తం మాగనూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన చికిత్స నిమి త్తం ఊత్తంగరై ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మణికంఠన్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయమై మణికంఠన్ తల్లి చాముండేశ్వరి సింగరపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టారు.
453 తాబేళ్లు స్వాధీనం
అన్నానగర్: విదేశాల నుంచి చైన్నెకి బంగారం స్మ గ్లింగ్ తరహాలో ఇటీవల నక్షత్ర తాబేళ్లు, పాము లు, కోతులు తదితర జంతువుల అక్రమ రవాణా ఎక్కువైపోతోంది. తాజాగా చైన్నె విమానాశ్రయంలో బుధవారం ఉదయం విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల వస్తువులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. థాయ్‌లాండ్‌కు చెందిన ఓ ప్రయాణికుడి సూట్‌కేస్‌లో పెద్దసంఖ్యలో ప్లాస్టిక్ డబ్బా లు ఉన్నాయి. దాన్ని తెరిచి చూడగా 453 నక్షత్ర తాబేళ్లు ఉన్నాయి. దీంతో వాటిని అధికారులు సీ జ్ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న తాబేళ్లను తిరిగి థాయ్‌లాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment