‘దైవానై’ కన్నీటి పర్యంతం | - | Sakshi
Sakshi News home page

‘దైవానై’ కన్నీటి పర్యంతం

Published Wed, Nov 20 2024 12:45 AM | Last Updated on Wed, Nov 20 2024 12:45 AM

-

● మేత తినకుండా శోకంలో మునిగిన తిరుచందూరు ఆలయ ఏనుగు

సేలం: మావటితో సహా ఇద్దరిని తొక్కి చంపిన తిరుచెందూరు ఆలయ ఏనుగు దైవానై మంగళవారం కన్నీటి పర్యంతమైంది. మేత తినకుండా శోకంలో మునిగిపోయింది. తిరుచెందూరు ఆలయంలో దైవానై(25) అనే పేరుతో ఆడ ఏనుగు ఉంది. ఈ ఏనుగును భక్తులు అత్యంత గౌరవంతో పూజిస్తుంటారు. ఉత్సవాల సమయంలో, ఉదయం, సాయంత్రం వేళల్లో జరిగే పూజల్లో ఈ ఏనుగు పాల్గొంటుంది. ఆలయం సమీపంలోనే ఈ ఏనుగు సంరక్షణ శిబిరం ఉంది. సోమవారం మధ్యాహ్నం దైవానై సంరక్షణ శిబిరంలో అరుపులు వినబడడంతో పోలీసులు పరుగులు తీశారు. అక్కడ దైవానై కాళ్ల కింద నలిగిన స్థితిలో ఓ యువకుడు మరణించి ఉండడాన్ని గుర్తించారు. సమీపంలోనే ఆ ఏనుగు సంరక్షకుడు మావటి ఉదయకుమార్‌ తీవ్రగాయాలతో పడి ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలో అతడు మరణించారు. మరో మృతుడిని మావటి ఉదయకుమార్‌ బంధువు శిశుకుమార్‌గా గుర్తించారు. జిల్లా అటవీ అధికారులు, వైద్యులు అక్కడికి చేరుకుని దైవానై ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఏనుగు మంగళవారం కన్నీటి పర్యంతమైంది. మావటి చనిపోవడంతో ఆహారం తినకుండా దిగాలుగా శోకంతో ఉన్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement