కొరుక్కుపేట: మలేషియా నుంచి చైన్నె వచ్చిన విమానంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. వివరాలు..మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి ప్రయాణికుల విమానం చైన్నెకి చేరుకుంది. ఇందులో కళ్లకురిచికి చెందిన మహిళ రాసత్తి మాయవన్ (37) సహా 167 మంది ప్రయాణించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులంతా విమానం నుంచి దిగిపోయారు. కానీ రాసత్తి మాత్రం సీట్లో కూర్చోనే ఉన్నారు. అనుమానం వచ్చిన విమాన సిబ్బంది ఎయిర్పోర్టు వైద్య బృందానికి సమాచారం అందించారు. వెంటనే వైద్య బృందం విమానం ఎక్కి రాసత్తిని పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు వారు తెలిపారు. గుండెపోటుతో చనిపోయిందా? లేక మరేదైనా కారణమా? ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment