మాజీ మంత్రి అల్లుడి హత్య కేసులో తీర్పు
● మహిళకు యావజ్జీవ శిక్ష
సాక్షి, చైన్నె : కేంద్ర మాజీ మంత్రి అల్లుడు, న్యాయవాది కామరాజ్ హత్య కేసులో మదురై కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో పురట్చి భారతం పార్టీ మహిళా విభాగం నేత కల్పనకు యావజ్జీవ శిక్ష విధించారు. కేంద్ర మాజీమంత్రి దళిత్ ఏలుమలై అల్లుడు, ప్రముఖ న్యాయవాది కామరాజ్ 2014లో చైన్నె ఓట్టేరిలోని నివాసంలో హత్యకు గురయ్యారు. ఈ కేసులో పురట్చి భారతం మహిళా విభాగం నాయకురాలు కల్పన, ఆమె ఇంట్లో పనిచేసే ఆనందన్, కార్తిక్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ తొలుత తిరువళ్లూరు కోర్టులో ఆతర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో మదురై జిల్లా మేజిస్ట్రేట్ కోర్టుకు మారింది. 2015 నుంచి ఈ కేసు విచారణ మదురై కోర్టులో జరుగుతూ వస్తోంది. విచారణలో జాప్యంపై 2021లో కామరాజ్ సహోదరి తేన్ మొళి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణను త్వరితగతిన ముగించాలన్న ఆదేశాలు వెలువడ్డాయి. కేసు విచారణను మూడు నెలలలో ముగిసి తీర్పు వెలువరించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో విచారణ వేగం పెరిగింది. మదురై జిల్లా కోర్టున్యాయమూర్తి శివ కటాక్షం కేసు విచారణను ముగించారు. మంగళవారం తీర్పు వెలువరించారు. కల్పనకు యావజ్జీవ శిక్షతోపాటు 5 వేలు జరిమానా విధించారు. మిగిలిన ఇద్దరిని విడుదల చేశారు.
హత్యకు గురైన కామరాజ్, శిక్ష పడ్డ కల్పన
Comments
Please login to add a commentAdd a comment