పల్లికరనైలో పక్షుల సందడి
– పదివేలకు పైగా పక్షుల రాక
కొరుక్కుపేట: పల్లికరణై సరస్సు పక్షులతో నిండిపోయింది. వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి పక్షులు, కొంగలు, పిచ్చుకలు, గద్దలతో పల్లికరనై సరస్సు కనువిందు చేస్తోంది. పక్షి ప్రేమికులను ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వివరాలు.. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో చైన్నెతోపాటు శివారు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా నీటి వనరులలో జలకళ కనిపిస్తోంది. ముఖ్యంగా పల్లికరనై చిత్తడి ప్రాంతం కూడా నీరు నిలిచి అత్యంత సుందరంగా కనువిందు చేస్తోంది. దీంతో ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి పల్లికరనై ప్రాంతానికి వచ్చే పక్షుల సంఖ్య పెరుగుతోంది. వివిధ రకాల బాతులు, పసుపు ముక్కు కొంగలు, రంగు రంగుల పిట్టలు, పిచ్చుకలు, గద్దలు సహా 10 వేలకు పైగా పక్షులు రావడంతో సరస్సు కళకళలాడుతోంది. వీటిని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment