27న ఊటీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
● నాలుగు రోజుల పర్యటన
సాక్షి, చైన్నె: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 27న రాష్ట్రానికి రాను న్నారు. నాలుగు రోజు ల పర్యటనలో భాగంగా పర్యాటక ప్రదేశం ఊటీలో జరిగే కార్యక్రమాలకు హాజర కానున్నారు. ఈనెల 27వ తేదీన ఢిల్లీ నుంచి కోయంబత్తూరుకు రాష్ట్రపతి రానున్నారు. ఇక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఊటీ వెళ్లనున్నారు. 28వ తేదీన ఊటీలో ఉన్న రాజ్‌భవన్ నుంచి కున్నూరుకు వెళ్తారు. వెల్లింగ్ టన్ ఆర్మీ శిక్షణ కేంద్రంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. 29వ తేదీ అక్కడే జరిగే మరికొన్ని కార్యక్రమాల లో పాల్గొననున్నారు. 30న కోయంబత్తూరుకు చే రుకునే రాష్ట్రపతి, తిరువారూర్ తమిళనాడు వర్సి టీ స్నాతకోత్సవానికి హాజరు కానన్నారు. ఈ ప ర్యటనను ముగించుకుని తిరుపతికి వెళ్లనున్నట్లు సమాచారం. రాష్ట్రపతి రాకతో నీలగిరి జిల్లాలోని ఊటీ, కోయంబత్తూరు పరిసరాలు, తిరువారూర్ వర్సిటీ పరిసరాలలో పోలీసులు భద్రతా పరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లపై దృష్టి పెట్టారు.
సంగీత సమ్మేళనంతో
కంబరామాయణం
● రేపు చైన్నెలో ప్రదర్శన
సాక్షి, చైన్నె: కంబ రామాయణాన్ని తమిళం– ఆంగ్ల తర్జుమాతో పాటు సంగీత సమ్మేళనంతో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. చైన్నె వేదికగా ఈ నెల 23న నారదగాన సభలో ఈ ప్రదర్శన జరగ నుంది. ప్రముఖ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, రె లా హాస్పిటల్ ఛైర్మన్ ప్రొఫెసర్ మహ్మద్ రేలా, పీ డియాట్రిక్ సర్జరీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రి యా రామచంద్రన్, ప్రముఖ కర్ణాటిక్ సంగీత కా రుడు సిక్కిల్ గురుచరణ్ సంయుక్తంగా ఈ కొత్త ప్రయోగంపై దృష్టి పెట్టారు. గురువారం స్థానికంగా జరిగిన సమావేశంలో వీరు మాట్లాడుతూ, వా ల్మీకి రామాయణం నుంచే కంబరామాయణం పు ట్టిందని వివరించారు. ఇది వెయ్యి సంవత్సరాల కావ్యం అని 10,500లకు పైగా శ్లోకాలతో కూడిన ఇతిహాసం అని వ్యాఖ్యలు చేశారు. కంబరామయణాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో తెలియజేయ డం లక్ష్యంగా వినూత్న ప్రయోగం మీద దృష్టి పె ట్టామన్నారు. కంబ రామాయణాన్ని కొత్త, వినూ త్న ఆకృతిలో ప్రదర్శించడానికి తాము ముగ్గరం ఒకే వేదిక మీదకు వచ్చామన్నారు. తమిళంలో డా క్టర్ ప్రియా రామచంద్రన్, ఆంగ్లంలతో తర్జుమా రూపంలో తాను, సంగీతం రూపకంతో గురుచర ణ్ అద్భుత ప్రదర్శనకు ఇవ్వబోతున్నారని ఈసందర్భంగా డాక్టర్ రేలా తెలిపారు. కంబ రామాయ ణం – పద్యాలు, పాట(ప్రధాన ఘట్టాలతో) ఈనె ల 23వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు నార ద గాన సభలో ఈ ప్రదర్శనకు ఏర్పాట్లు చేశామన్నారు. 90 నిమిషాలకు పైగా సంగీత కళాత్మకతతో కంబన్ తెలిపిన సారంశాన్ని మిళితం చేసే విధంగా కొత్త అనుభూతి ప్రేక్షకులకు కల్పించే రీతిలో ఈ ప్రదర్శన ఉండబోతోందన్నారు.
పట్టాభిరాంలో కొత్త టైడల్ పార్క్
సాక్షి, చైన్నె : చైన్నె శివారులోని పట్టాబిరాంలో కొత్త టైడల్‌పార్కు సిద్ధమైంది. రూ. 330 కో ట్లతో 11.41 ఎకరాల లో 21 అంతస్తులతో ఈ టై డల్ పార్కును రూపొదించారు. దీనిని సీఎం స్టాలిన్ గురువారం ప్రారంభించనుతున్నారు. ఇక్కడ 6 వేల మందికి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే కాంచీపురం జిల్లా పరిధిలోని తిరుముడి వాక్కంలో ఇంజినీరింగ్, టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. రూ. 18.18 కోట్లతో తొలి విడతగా ఈ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇది లా ఉండగా చైన్నెలో బీచ్‌ల అభివృద్ధిలో భాగంగా తిరువొత్తియూరులో బీచ్ సుందరీకరణ పనుల వేగాన్ని పెంచారు. రూ. 272 కోట్లతో ఇక్కడ సుందరీకరణ పనులు ముగింపు దశకు చేరాయి. పర్యాటకులు, సందర్శకులను ఆకర్షించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అలాగే చైన్నె కొళత్తూరులోని రెట్టేరి సుందరీకరణ పనులు సైతం ముగింపు దశకు చేరాయి. రూ. 10 కోట్ల ఖర్చుతో రెట్టెరి చెరువును పర్యాటకంగా తీర్చిదిద్దారు.
తూత్తుకుడి విమానం
మదురైలో ల్యాండింగ్
సాక్షి, చైన్నె: తూత్తుకుడిలో వాతావరణం అనుకూలించక పోవడంతో విమానాన్ని మదురైలో ల్యాండింగ్ చేశారు. ఇందులో రహదారుల శాఖమంత్రి ఏవీ వేలుతోపాటు 77మంది ప్రయాణికులు ఉన్నారు. చైన్నె నుంచి తూత్తుకుడికి ఉదయం విమానం టేకాఫ్ తీసుకుంది. తూత్తుకుడి విమానాశ్రయంలో ల్యాండింగ్ చేయాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించక పోవడంతో ల్యాండింగ్ చేయలేని పరిస్థితి. ఈ విమానంలో మంత్రి ఏవీ వేలు తోపాటు 77 మంది ఉన్నారు. గాల్లో చాలాసేపు చక్కర్లు కొట్టిన విమానాన్ని చివరకు ఫైలట్ మదురై విమానాశ్రయం వైపుగా నడిపించారు. తర్వాత అక్కడ సురక్షితంగా ల్యాండింగ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment